మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణను ఒప్పుకోం

వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షేక్ బాబా సలామ్

అనంత‌పురంలో సోష‌ల్ మీడియా, మేధావుల విభాగం ఆధ్వ‌ర్యంలో సంత‌కాల సేక‌ర‌ణ‌

అనంత‌పురం:  మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌ను ఒప్పుకోమ‌ని, కూట‌మి ప్ర‌భుత్వం త‌మ నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షేక్ బాబా సలామ్ డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రవేటికరణ కు వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా, మేధావుల విభాగం సంయుక్తంగా అనంతపురం నగరంలోని నడిమి వంక నుంచి కళ్యాణదుర్గం రోడ్ వర‌కు సంతకాల సేకరణ చేప‌ట్టారు.  ఈ సందర్భంగా సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం  పేదవారి ఉన్నత విద్యను కూడా దూరం చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను అంధకారం లోకి నెడుతోంది అని మండిపడ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ  మేధావుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరయ్య  మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం లో ప్రభుత్వ రంగ సంస్థలనే కాకుండా విద్య రంగానికి చెందిన సంస్థలను సైతం ప్రవేటికరణ చేయడం అనేది దుర్మార్గపు చర్య అని అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో  విద్యాభివృద్ధి కోసం చేపట్టిన పథకాలు, కార్యక్రమలు చరిత్రలో సువర్ణ లిఖించబడ్డాయి అని తెలిపారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ మేధావుల విభాగం రాష్ట్ర కార్యదర్శి కట్టుబడి తానిషా, నాయకులు రిటైర్డ్‌ కామర్స్ లెక్చరర్ మహాదేవ రెడ్డి , దాసి రెడ్డి పాల్గొన్నారు.

Back to Top