కోటి సంత‌కాల సేక‌ర‌ణ పూర్తి చేసిన విద్యార్థి విభాగం నేత‌లు

అభినందించిన పార్టీ జిల్లా అధ్య‌క్షుడు అనంత వెంక‌ట్రామిరెడ్డి

అనంతపురం : కూటమి కుట్రల్లో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లను ప్రైవేటీకరణ చేసే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వ‌ర్యంలో అనంత‌పురంలో చేప‌ట్టిన కోటి సంత‌కాల సేక‌ర‌ణ పూర్తి అయ్యింది. పూర్తి చేసిన సంత‌కాల‌ను ఇవాళ అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు అనంత వెంక‌ట్రామిరెడ్డికి అంద‌జేశారు. దీంతో విద్యార్థి విభాగం నేత‌ల‌ను అనంత వెంక‌ట్రామిరెడ్డి అభినందించారు.  కార్య‌క్ర‌మంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్య‌క్షుడు చంద్ర‌శేఖ‌ర్ యాద‌వ్‌, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ రాయల్, ప్రధాన కార్యదర్శి సాయి నితిన్, నగర అధ్యక్షుడు కైలాష్ ఉపాధ్యక్షుడు శివ, నగర ప్రధాన కార్యదర్శులు పులి కార్తికేయ, ఫయాజ్,కార్యదర్శులు నరేంద్ర రెడ్డి,గౌరీ, సాయి యాదవ్, బాబా ఇమ్రాన్, లోకేష్,  హ‌రీష్, మెహరాజ్, చరణ్, రాహుల్ రెడ్డి, అశోక్ రాయల్ తదితరులు పాల్గొన్నారు

Back to Top