విశాఖ దక్షిణలో ఉధృతంగా కోటి సంతకాల సేకరణ 

మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ   నిలిపివేయాలి

ప్రజాభిప్రాయం లేకుండా ప్రైవేటీకరణ చేస్తారా? 

మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఫైర్‌

విశాఖ‌:  ప్రభుత్వ మెడికల్ కాలేజీల‌ ప్రైవేటీకరణ  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయస్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో విశాఖ ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టిన కోటి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం ఉధృతంగా సాగుతోంది.  ప్రజా వైద్య విద్యను లూటీ చేసే ప్రైవేటీకరణ ను కూటమి ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు.  విశాఖ దక్షిణ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 37వ వార్డులో ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా (రచ్చబండ) కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 37వ వార్డ్ కార్పొరేటర్ చెన్నా జానకిరామ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వాసుపల్లి తో పాటు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర  భరత్ హాజరయ్యారు. విద్యార్థులు మేధావులు ప్రజల వద్ద నుండి సంతకాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ఆరోగ్యం అటకెక్కించారన్నారు. అది చాలక జగన్మోహన్ రెడ్డి పేదల కోసం నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండపడ్డారు. ప్రజాభిప్రాయం లేకుండా ప్రభుత్వం మెడికల్ కాలేజీలను దారాదత్తం చేస్తే సహించమని హెచ్చరించారు. దక్షిణ నియోజకవర్గంలో అన్ని వార్డులలో కోటి సంతకాల సేకరణ ఉధృతంగా జరుగుతున్నాయని వాసుపల్లి తెలిపారు

Back to Top