అబ‌ద్ధం రాజ్యమేలుతోంది 

అప్పు చేస్తే గాని పూట గడవని కూటమిపాలన 

నాణ్యమైన మద్యం కల్తీ మద్యం అన్నింట కూట‌మి నేత‌ల‌కు వాటా 

మాజీ మంత్రి డాక్ట‌ర్ సాకే శైల‌జానాథ్ ఆగ్ర‌హం

ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా శింగ‌న‌మ‌ల‌లో భారీ నిర‌స‌న ర్యాలీ

అనంత‌పురం:  రాష్ట్రంలో అబ‌ద్ధం రాజ్య‌మేలుతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ స‌భ్యుడు, మాజీ మంత్రి డాక్ట‌ర్ సాకే శైల‌జానాథ్ మండిప‌డ్డారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీ లను ప్రైవేటు పరం చేయడానికి నిరసిస్తూ, శింగనమల మండల కేంద్రంలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీను భారీగా తరలివచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులతో దర్గా సెంటర్ నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు వెళ్లి అక్కడ అధికారులకు వినతి పత్రం అందించారు.  ఈ సంద‌ర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ..  
పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టుతు, సంపద సృష్టిస్తానని నమ్మ పలుకుతూ ఉన్న ఆస్తులను సంపన్నులకు కట్టబెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు గారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. డాక్టరు చదవాలన్నది ప్రతి పేద విద్యార్థి కళ, ఆ కలను సాకారం చేయడానికి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని వైయస్ జగన్ తీసుకుని 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. వీటివల్ల మెడికల్ సీట్లే కాకుండా ప్రతి పేదవాడికి ఉచితంగా మెరుగైన వైద్యం అందుతుంది అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. 

ఏ నాయకుడైనా ప్రజలకు మంచి చేస్తాం పంటలకు నీళ్లు అందిస్తాం, తక్కువ ధరలకు మంచి ఎరువులు అందిస్తాం, పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తాం అని చెప్పే నాయకులను చూశాను కానీ,  మీకు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తామని అని చెప్పే నాయకుడు బహుశా బాబు గారు ఒక్కరే.

రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పూర్తి అవుతే ఎంతోమంది పేద విద్యార్థులు డాక్టర్లుగా తయారవుతారు అలాగే రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది అనే ఆలోచన వదిలేసిన ఈ కూటమి ప్రజా ప్రతినిధులు మద్యం షాపులు, బెల్టు షాపులు నిర్వహించుకుంతున్న వైనాన్ని చూస్తున్నాం. ఇదేమిటని ప్రశ్నిస్తే కేసులు పెడతూ పోలీసు వ్యవస్థను కూడా నాశనం చేస్తున్నారు. 

అన్ని తానే కనుగొన్నాను అని చెప్పుకునే బాబు గారు ఇన్ని సంవత్సరాల మీ రాజకీయ జీవితంలో మీరు గొప్పగా చెప్పుకునే ఒక్క పథకమైన ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వంలోనే పథకాలకు పేర్లు మార్చి నేనే కనిపెట్టాను అని చెప్పుకొని నీచమైన రాజకీయ స్థితిలో మీరు ఉన్నారు. ఆవు కంచమేస్తే దూడ చేను వేస్తుందా అన్నట్టు పెద బాబు, చినబాబు లాగా నియోజకవర్గ నాయకులు కూడా అవినీతిమయంలో సేద తీరుతున్నారు. పైగా ఏమి చేయకపోయినా కూడా అన్ని మేమే చేసాము అన్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నా మీరు నాయకులేనా అన్న సందేహం కలుగుతుంది. 

మీరు చేసే అక్రమాలను దౌర్జన్యాలను బయటపెడుతున్న వారినీ భయభ్రాంతులకు గురి చేస్తూ కేసులు పెడుతున్నారు, మీరు పెట్టే కేసులకు మీ దౌర్జన్యాలకు ఏ ఒక్క వైసీపీ కార్యకర్త కూడా భయపడడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను.

కూటమి నాయకులు గుర్తుపెట్టుకోవాలి మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం అయితే మేము మీరు అన్న తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన ఫీజులు వసూలు చేస్తారు మీకు ఎలాంటి మినహాయింపు ఉండదు. పెద్ద చదువులు చదవాలన్న పేద విద్యార్థుల ఆశయాలను నాశనం చేయొద్దు అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వ ఆస్తులు మీ అనుమాయులకి అప్పనంగా దోచిపెడతాము అంటే రాష్ట్ర ప్రజల తరఫున పోరాడటానికి వైయస్సార్ సిపి సి సిద్ధంగా ఉంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సర కాలం లోనే అన్ని వర్గాల ప్రజలు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి విధ్వంసకర పాలన సాగిస్తున్నాడో అర్థమవుతుంది. రాష్ట్ర ప్రజలకు ఈపాటికి అర్థం అయిపోయింది బాబు పాలనకు జగనన్న పాలనకు గల వ్యత్యాసం. సంపద సృష్టి దేవుడికి ఎరుక అప్పులు చేయందే పూట గడవదు అనే విధంగా దుర్మార్గమైన పాలన సాగిస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. 

రాజకీయాలు ఉన్నంతవరకు పలానా నాయకుడు ఈ మంచి పని చేశాడు అని గుర్తుంచుకోవాలి అలాంటి నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కానీ రాష్ట్ర రాజకీయాలలో అబద్దాలు మోసాలతో అధికారం పొందే నాయకుడంటే చంద్రబాబు గారి గుర్తొస్తారు..

చంద్రబాబు నాయుడు మళ్లీ అదే పాత నాటకం ఆడుతున్నాడు. ఒక వైపు ప్రజల ఆస్తులను అమ్మేస్తూ, మరోవైపు ప్రజలను మోసగించడం కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల పక్షాన నిలబడి, వారి ఆస్తులను, హక్కులను కాపాడే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.  ఈ ఉద్యమానికి జగనన్నను బలపరచడానికి ప్రతి ఒక్కరూ కూడా జగనన్న పక్షాన నిలవాలని అన్యాయాన్ని ఎదిరించే దారిలో మనం కూడా భాగం కావాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అని అన్నారు.

పార్లమెంట్ అబ్జర్వర్ బి .నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించే కుట్రకు వ్యతిరేకంగా ప్రజా హక్కులను రక్షించే వైయ‌స్ఆర్‌సీపీ మహా పోరాటం — “జగన్ అంటే జనం, జనం అంటే జగన్” అనే నినాదంతో ప్రజల మధ్య బలమైన ఉద్యమంగా రూపుదిద్దుకుంటోందన్నారు. 
కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, రాష్ట్ర అనుబంధ విభాగాల నాయకులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల నాయకులు, మండల అనుబంధ విభాగాల నాయకులు, జిల్లా అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Back to Top