అనంతలో హోరెత్తిన ‘ప్రజా ఉద్యమం`

నిర‌స‌న ర్యాలీలో క‌దం తొక్కిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, విద్యార్థులు

అనంతపురం :   ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో  నిర్వ‌హించిన‌  ‘ప్రజా ఉద్యమం’ నిరసన ర్యాలీ హోరెత్తింది. ఈ ర్యాలీకి భారీగా  ప్రజలు, వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు త‌ర‌లివ‌చ్చారు. నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల నుంచి టవర్‌క్లాక్‌ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు  నిరసన ర్యాలీ కొన‌సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు గళమెత్తారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు పేదల భవిష్యత్తు.. ఉచిత విద్య, వైద్యం ప్రజల హక్కు అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్‌ కళాశాలలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ అధికారులకు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ నేతలు విన‌తిప‌త్రం అంద‌జేశారు.  

Back to Top