పీపీపీ ప్ర‌య‌త్నం విరమించుకోవాలి ! 

అల్లూరి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు  మత్స్యరాస విశ్వేశ్వర రాజు, ఎంపీ త‌నూజ‌  డిమాండ్‌

అల్లూరి జిల్లా:  మెడిక‌ల్ కాలేజీల‌ను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్య‌క్తుల‌కు క‌ట్ట‌బెట్టాల‌నుకునే ప్ర‌య‌త్నాన్ని కూట‌మి ప్ర‌భుత్వం విర‌మించుకోవాల‌ని అల్లూరి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే  మత్స్యరాస విశ్వేశ్వర రాజు, ఎంపీ త‌నూజ‌ డిమాండ్ చేశారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు మేరకు పాడేరు పాడేరు నియోజకవర్గంలో  మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు నిరాకరిస్తూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేప‌ట్టి, ఆర్డీవోకు వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు వినతి పత్రం అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ త‌నూజ‌,  ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు మీడియాతో మాట్లాడుతూ.. గత వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు నిర్మాణానికి అడుగులు వేశారు, నిర్మాణం చేపట్టిన ఈ మెడికల్ కాలేజీలు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చెయ్యడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నారు, వైద్య విద్యను అభ్యసించాలనుకునే పేద విద్యార్థులకు పీపీపీ పేరుతో చంద్రబాబు నాయుడు తీరని అన్యాయం చేస్తున్నారు,ఈ పీపీపీ ఆలోచన విధానాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి లేదంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. కార్య‌క్ర‌మంలో  రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు, మాజీ శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు మాజీ శాసన సభ్యులు చెట్టి పాల్గుణ , ఎంపీపీ లు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు,  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top