రాజ్యాంగ సంక్షోభంతోనే రాష్ట్ర విభజనకు చెక్

హైదరాబాద్‌, 24 అక్టోబర్‌ 2013:

సీమాంధ్రలోని ఎంపీలందరూ రాజీ నామా చేసి, రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని, అప్పుడే మైనార్టీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కుప్పకూలి రాష్ట్ర విభజన ఆగుతుందని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ నాయకుడు తోట చంద్రశేఖర్ అన్నారు.‌ పార్టీ అధినేత ఆధ్వర్యంలో శనివారంనాడు హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో జరిగే సమైక్య శంఖారావం సభతో ఢిల్లీ పీఠం కదలబోతోందని ఆయన జోస్యం చెప్పారు.

ప్యాకేజీలకు కేంద్ర మంత్రులు లొంగిపోవడం దుర్మార్గమని చంద్రశేఖర్‌ నిప్పులు చెరిగారు. కేవలం 12 పార్లమెంటు సీట్ల కోసం కక్కుర్తి పడి కాంగ్రెస్ పార్టీ ‌మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా ముక్కలు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అప్రజాస్వామికంగా రాష్ట్ర విభజనకు యూపీఏ పూనుకుంటోందని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగితే అన్ని వర్గాల ప్రజలూ నష్టపోతారని చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ వై‌యస్ జగన్‌కు మద్దతు పలికి సమైక్య శంఖారావం సభను విజయవంతం చేద్దామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

Back to Top