శ్వేత పత్రాలు కావని తెల్లకాగితాలే

అభద్రతా భావంతోనే ఇవిఎం పై విమర్శలు

బాబు తిరుపతి జోలికి వెళ్లవద్దు

వైయస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆనం
రామనారాయణరెడ్డి

హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ తరపున ఇచ్చే శ్వేతపత్రాలకు
ప్రతిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పక్షాన బ్లాక్ పేపర్లను విడుదల చేస్తామని పార్టీ
సీనియర్ నాయకులు ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. రామాయపట్నం, కడప ఉక్కు
కర్మాగారాల పేరుతో చంద్రబాబు నాయుడు  కొత్తగా
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు
నాయుడిలో రోజురోజుకి అభద్రతా భావం పెరిగిపోతోందని, అందుకనే ఆయన ఏం మాట్లాడుతున్నారో
ఆయనకే అర్థం కాని పరిస్థితికి దిగజారి పోతున్నారని ఆనం ధ్వజమెత్తారు. పార్టీ
కేంద్ర కార్యాలయంలో ఆదివారం నాడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

 మభ్యపెట్టడానికే శ్వేతపత్రాలు

గతంలో అధికారంలో ఉన్నప్పుడూ, ఇప్పుడున్న
నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రానికి నువ్వు ఏం ఒనగూర్చరని ఆనం సూటిగా ప్రశ్నించారు.
ఇప్పుడు విడుదల చేయనున్న శ్వేతపత్రాలతో ఏం సాధించాలనుకుంటున్నారని నిలదీశారు.కేవలం
ప్రజలను మభ్యపెట్ట఼డానికి, మోసం చేయడానికి మరో ప్రయత్నం చేస్తున్నారని తేటతెల్లం
అవుతోందన్నారు. ఆయన ధర్మ పోరాటంలో ఎంత నిజాయితీ, ధర్మం ఉందో అర్థం అవుతోంది.

రియల్ ఎస్టేట్ కోసమే కడప ఉక్కుఫ్యాక్టరీ,
రామాయపట్నం పోర్టులు

కడపలో ఉక్కు ఫ్యాక్టరీ తానే స్థాపించి, మేమే నిర్వహిస్తామని
చంద్రబాబు ప్రకటించడం వెనక కూడా ఆయన స్వార్ధపు ప్రయోజనాలు, కుట్రలు
ఉన్నాయని ఆనం రామానారాయణరెడ్డి అన్నారు. రాష్ట్లంలో ఆర్ధిక
పరిస్థితి బాగాలేదు, విద్యార్దులుకు ఫీజు రీయింబర్స్ మెంటు కూడా ఇవ్వలేని ,
సంక్షేమ పథకాలకు కూడా గండి కొడుతున్న నేపథ్యంలో, కడపలో ఉక్క ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామంటూ
కేంద్ర ప్రభఉత్వం ఒక పక్క ప్రకటిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటు
చేయడానికి కొత్తగా నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

బాబాగారి పార్టీకి చెందిన పార్లమెంటు సఙ్యులు
దాదాపు 5,6 వేల ఎకరాలు కొనుగోలు చేసి, ఉక్కు ఫ్యాక్టరీ పేరిట చూపించి కోట్లాది
రూపాయలను ఆర్ఝించాలనే కుట్ర కనిపిస్తోంది. కడప, రాయలసీమ ప్రజలను మోసం చేయడానికి
రియల్ ఎస్టేట్ భూముల వ్యాపారానికి కొత్త నాటకానికి తెరి దీశారని బాబు కుట్రను
వెల్లడించారు.

అలాగే దుగ్గరాజ పట్నం పోర్టు విషయాన్ని కూడా
పక్కకు పెట్టి, రామాయపట్నం పోర్టు, ఇండస్ట్రియల్ క్యారిడార్ అంటూ ప్రకాశం, నెల్లూరు
జిల్లాల ప్రజలను మోసం చేయడానికి కూడా పూనుకుంటున్నారన్నారు. ఇలా కొత్త దోపిడికి తెరదీశారన్నారు.
ఉక్కు కర్మాగారాం, రామాయపట్నం పోర్టులనేవి
పారిశ్రామిక పురోబివృద్ది కోణంలోకాకుండా తమ సొంత ప్రయోజనాల కోసమే అని తేటతెల్లం
అవుతోందన్నారు.

ఓటమి భయంతోనే ఇవిఎంలపై విమర్శలు

రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో
తనకు ఓటమి ఖాయమన్న సంగతి స్పష్టమైనందునే, ఆ అభద్రతను, భయాన్ని కప్పిపుచ్చుకునేందుకే
ఎన్నికల కమిషన్, ఇవిఎంలపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ఆనం తీవ్రంగా
మండిపడ్డారు.

ధర్మ పోరాట దీక్షలో ఇవిఎంలు పనిచేయడం
లేదు. ఇవిఎంలు అక్కర్లేదు అని మాట్లాడుతున్నారంటేనే, ఆయనలోని ఓటమి భయం అభద్రతా
భావానికి నిదర్సనమన్నారు. దానిని కప్పిపుచ్చుకోడానికే ఇవిఎంలపై తప్పు నెట్టే యత్నం
చేస్తున్నారన్నారు. ఉత్తర భారత దేశఁలో ఆయన ప్రమేయం ఎంత మాత్రం లేకుండా జరిగిన ఎన్నికల్లో
ఇవిఎంలు బాగా పనిచేస్తే, తాను ఓటమి పాలైన చోట్ల పని చేయలేదనడం ఆయన స్థితిని చాటుతోందన్నారు.
చంద్రబాబుకు ఓటమిని అంగీకరించే ధైర్యం లేదన్నారు. అందుకనే అత్యున్నతమైన ఎన్నికల
కమిషన్, ఇవిఎంలను విమర్శించే స్థాయికి తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని
దిగజార్చుకుంటున్నారని ఆనం అన్నారు. ఇతర పార్టీలకు చెందిన కొనుగోలు చేసిన ఎంపిలతో
సహా 20 మంది ఎంపిలున్నా ఏమీ చేయలేని చంద్రబాబు, మొత్తం 25 మంది ఎంపిలను ఇవ్వాలని
కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజకీయ సిద్ధాంతాలు, విలవలు లేని స్థాయికి దిగజారి
బాబు వ్యవహరిస్తున్నారన్నారు.

 చంద్రబాబుకు శ్వేత పత్రాలకు అవినాభావ
సంబంధం ఉంది. గతంలో ఎన్టీఆర్ నుంచి వెన్నుపోటు పొడిచిన తరువాత  నుంచి విడుదల చేసిన , 2014 అధికారంలోకి వచ్చేంత
వరకు విడుదల చేసిన శ్వేతపత్రాల స్థాయి ఏమిటో ప్రజలందరికీ తెలుసునన్నారు. ఇప్పుడు మళ్లీ
శ్వేతపత్రాలను విడుదల చేయడం హాస్యాస్పదమన్నారు. ఆయన విడుదల చేయబోయే శ్వేత పత్రాల
విలువ కేవలం తెల్లకాగితం మాత్రమే అని ఆనం పేర్కొన్నారు. శ్వేత పత్రాలతో మరోసారి ఆయనలోని
భయాన్ని మరోసారి బయటపెట్టుకుంటున్నారు.శ్వేత పత్రాలతో రాష్ట్ర ప్రజలను మోసం
చేయడానికి కొత్త పల్లవి అందుకోవడం తప్ప, శ్వేత పత్రాలతో ప్రజలకు ఒనగూరేదేమీ లేదని
ఆనం అన్నారు.

గతంలో వైయస్ఆర్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష
నాయకులుగా ఉన్నప్పుడు చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాలకు ప్రతిగా బ్లాక్ పేపర్లు
విడుదలచేశారని, ఇప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ కూడా అదే విధంగా బ్లాక్ పేపర్లను విడుదల
చేస్తుందన్నారు.

అసలు శ్వేత పత్రాలన ఎందుకు విడుదల
చేయాల్సి వస్తోందని, ప్రజలకిచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చారా అని సూటిగా
ప్రశ్నించారు.

చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే, ధైర్యం
ఉంటే, 2009 లో వైయస్ఆర్ తాము చేసిన సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు చేరి ఉంటే,
ఎన్నికల్లో వారిచ్చే తీర్పే శ్వేతపత్రం అని ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లారని గుర్తు
చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు గత నాలుగున్నరేళ్ల కాలంలో మంచి చేసి ఉంటే ప్రజలిచ్చే
తీర్పే శ్వేతపత్రం అవుతుంది తప్ప మరోటి కావన్నారు. ఏదిఏమైనా టిడీపీ ప్రభుత్వం
విడుదల చేసే  ప్రతి శ్వేతపత్రానికి ప్రతిగా
వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో  బ్లాక్ పేపర్లను
విడుదల చేస్తామని ప్రకటించారు.

చంద్రబాబుకు మానియా

ముఖ్యమంత్రిగారికి ఒక మానియా పట్టుకున్నట్లుందని.
ఎక్కడికెళితే అక్కడి దేశపు వాడిగా మారిపోతారని ఆనం విమర్శించారు. సింగపూర్, చైనాకు
ఇలా ఎక్కడికెళితే ఆ ప్రాంతంలాగా రాష్ట్రాన్ని మార్చేస్తానంటున్నారని ఈధోరణి
చూస్తుంటే ముఖ్యమంత్రిగారికి , అఆలోచన సరిగా ఉందా. ఆరోగ్య పరంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా
అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు.

అదే కోవలో కోట్లాది మంది హిందువుల
మనోభావాలు దెబ్బతినేట్లుగా తిరుపతి పట్టణాన్ని సిలికాన్ సిటీ మారుస్తానంటూ
మాట్లాడటం అర్ధరహితమన్నారు. ఈప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలన్నారు. గతంలో ఒకసారి
శ్రీనివాసుడి ఆగ్రహాన్ని చవిచూశారని ఇప్పుడు మళ్లీ ఆదేవదేవుని జోలికి
వెళవద్దన్నారు. అసలు తన సొంత జిల్లాలోని తిరుపతి పై చంద్రబాబుకు ఎందుకింత కక్ష అని
సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికే నెల్లూరు, చిత్తురు జిల్లాలో టీడీపి నేతలు సిలికా
మైనింగ్ తో దోచుకుతింటున్నారనీ, ఇప్పుడు ఏకంగా సిలికాన్ వ్యాలీగా మారుస్తాననడం
సిగ్గు చేటన్నారు. ఇలా చంద్రబాబు తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తానంటే ప్రజలు
హర్షించరని, ఆయనకు తగిన గుణపాఠం చెపుతారని ఆయన హెచ్చరించారు.

తాజా వీడియోలు

Back to Top