ప్రవాసాంధ్రులకు కృతజ్ఞతలు

హైదరాబాద్ః  ప్రవాసాంధ్రులకు ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. హోదా పోరాటంలో ఎన్ఆర్ఐల ఉత్సాహం తన నిబద్ధతను మరింతగా పెంచిందని వైయస్ జగన్ స్పష్టం చేశారు. ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ప్రత్యేకహోదా అంశంపై డిజిటల్ మీడియా ద్వారా  వైయస్ జగన్ ప్రవాసాంధ్రులతో సుదీర్ఘంగా  ముఖాముఖి నిర్వహించిన సంగతి తెలిసిందే.

ప్రత్యేకహోదా ఆవశ్యకతపై ప్రవాసాంధ్రులకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు. వివిధ దేశాలకు చెందిన ఎన్ఆర్ఐలు ఈకార్యక్రమంలో పాలుపంచుకొని వైయస్ జగన్ కు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. వారి సందేహాలను వైయస్ జగన్ స్పష్టంగా నివృత్తి చేశారు. 
Back to Top