హోదా ఇవ్వకపోయినా కృతజ్ఞతలా..?

పశ్చిమగోదావరి: చంద్రబాబు హోదాను బీజేపీ పెద్దలకు తాకట్టు పెట్టారని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. బాబు కేంద్ర సాయంతో సంతృప్తి చెంది ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ధ్వజమెత్తారు.

ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రధాని నరేంద్రమోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పడం దారుణమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
Back to Top