వైయస్సార్సీపీలోకి తెలుగుతమ్ముళ్లు

అనంతరపురంః వైయస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. చంద్రబాబు అవినీతి, అరాచకాలతో విసిగి వేసారిన తెలుగుతమ్ముళ్లు ఆ పార్టీని వీడి వైయస్సార్సీపీ వైపు ఆకర్షిలవుతున్నారు. నిరంతరం ప్రజల పక్షాన పోరాడే వైయస్ జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. గార్లదిన్న మండలం యర్రగుంట్ల గ్రామంలో వైయస్సార్సీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున వైయస్సార్సీపీలో చేరారు.

Back to Top