తెలుగు ప్రజల పెన్నిధి వైఎస్సార్..!

పెద్దన్నగా అన్నీ తానై ఆదుకున్న మహానేత..!

హైద‌రాబాద్: ప్ర‌జా సంక్షేమ‌మే ఊపిరిగా ప్ర‌జ‌ల మ‌న‌స్సులో నిలిచిన నేత వైఎస్సార్‌. దివంగ‌త మ‌హానేత అమ‌లు చేసిన ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల రూపంలో ఆయ‌న ఇప్ప‌టికీ మ‌నంద‌రి గుండెల్లో నిలిచి ఉన్నారు.

ప్రాణం పోసిన రాజీవ్ ఆరోగ్యశ్రీ
వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలో నుంచి పుట్టిందే ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’. ఇది నిజంగా పేదల సంజీవనే. చిన్న చిన్న జబ్బులతోపాటు పెద్ద జబ్బులకు కూడా ఉచిత వైద్యం అందించే ఏర్పాటు ఆరోగ్యశ్రీ ద్వారా చేశారు వైఎస్. దాదాపు 1000 రకాల జబ్బులకు ఆరోగ్యశ్రీలో చోటు కల్పించారు.    108 అంబులెన్స్లు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా దాదాపు 5, 10 నిమిషాల్లో సంఘటనా స్థలాలనికి కుయ్..కుయ్..కుయ్ అంటూ వచ్చి వారిని ఆస్పత్రులకు చేర్చుతున్నాయి.  చిన్న చిన్న రోగాలకు వైద్య సలహాలు అందించేందకు 24 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా  104 ఉచిత కాల్ సెంటర్ను, నిర్దేశిత దిన వైద్య పరీక్షలు నిర్వహించే 104 సంచార వాహనాలను ప్రవేశపెట్టిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డిదే. 
 
రైతులకు ఊపిరిలూదిన ఉచిత విద్యుత్
ముఖ్యమంత్రి అయిన వెంటనే వ్య‌వ‌సాయానికి  ఉచిత విద్యుత్ ఇస్తానని ప్రకటించారు.  ఆ ఉచిత విద్యుత్ రైతులకు ఊపిరిలూదింది. వైఎస్సార్ పాల‌న‌లో నిరంత‌రాయంగా వ్య‌వ‌సాయానికి ఉచిత విద్యుత్ అందించ‌టం జ‌రిగింది. అప్ప‌టిదాకా వ్య‌వ‌సాయం దండ‌గ అన్న భావ‌న‌ను అమ‌లు ప‌ర‌చిన చంద్ర‌బాబు పాలన నుంచి విముక్తి ల‌భించింది. వ్య‌వ‌సాయాన్ని పండ‌గ లా మార్చిన ఘ‌న‌త రాజ‌న్న‌ది.  విద్యుత్ ఇవ్వడం, పంటలు పండేటట్లు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డిని దేవుడిలాగా చూసుకున్నారు రైతులు. 
 
అపర భగీరథుడు వైఎస్
అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను గౌరవ ప్రదమైన స్థానంలోకూర్చోబెట్టాలంటే ప్రాజెక్టుల నిర్మాణమే సరైనదని వైఎస్ భావించారు.    జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులు 86. భారీ తరహా నీటి ప్రాజెక్టులు 44 కాగా మధ్య రతహా నీటి ప్రాజెక్టులు 30. భూమి కోతను నివారించేందుకు నదీగట్టు ప్రాంతాలను పట్టిష్టపరిచే పథకాలు నాలుగు. ఆధునికీకరణ ప్రాజెక్టులు ఎనిమిది. ఇందులో పూర్తి చేసినవి నాలుగు మధ్యతరహా, నాలుగు భారీ తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. 74 నిర్మాణంలో ఉన్నాయి. దేశంలో ఎక్కడా కూడా చేపట్టని విధంగా రాష్ట్రంలో 52 వేల కోట్లకు పైగా ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టారంటే అది వైఎస్ ఘనతే. 
 
అన్నదాత సుఖీభవ!
కిలో బియ్యం రూ.15 నుంచి రూ.20లు అమ్ముతున్న రోజులవి. పేదవాడు కడుపు నిండా అన్నం తినాలన్నా ఆలోచన చేయాల్సి వచ్చేంది. అలాంటి సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక  పేదవాళ్లకు కిలో బియ్యం రూ.2లకే అందించే ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి నష్టం వస్తుందని అధికారులు వాదిస్తున్నా... బడ్జెట్ లేదని లెక్కలు చెబుతున్నా పట్టించుకోకుండా ముందుకెళ్లారు.  
 
ప్రతికుటుంబానికి ఇల్లు..!
అర్హులైన పేదలందరికీ సొంతిల్లు నిర్మించాలనే సంకల్పంతో ముందుకెళ్లి బడుగు, బలహీన వర్గాలతో పాటు మధ్యతరగతి, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు కూడా సొంతింటి కలను సాకారం చేశారు. ‘‘ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ’’ పథకాలను ప్రవేశపెట్టి ఇల్లులేని చాలా మందిని సొంతింటి వారిని చేశారు. కనీస అవసరాలైన కూడు..గూడును కల్పించారు. ఎవరు వద్దంటున్నా పట్టించుకోకుండా ముందుకెళ్లి అందరి మన్ననలు పొందారు. 
 
ఫీజు రీయింబర్స్ మెంట్తో ఉన్నత చదువులు
అందరూ ఉన్నత చదువులు చదువుకునే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ఎంతోమంది విద్యార్థులకు ఊరట కలిగించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఇంజినీరింగ్, మెడికల్ విద్య వరకూ చదువుకునేందుకు ఈ పథకం ద్వారా వైఎస్ అవకాశం కల్పించారు. అంతేకాదు డబ్బు లేదని చదువు నిరాకరించవద్దని విద్యా సంస్థలకు, అధికారులకు స్పష్టం చేశారు.   
 
వైఎస్ వరం.. పావల వడ్డీకే రుణం
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చాలా విప్లవాత్మక నిర్ణయాలుతీసుకున్నారు. అలాంటి వాటిల్లో  ‘ఇందిరా క్రాంతి పథకం’ ఒకటి.  మహిళలను లక్షాధికారులను చేయాలనే ఏకైక సంకల్పంతో చేసిన సృష్టే ఈ పావల వడ్డీకే రుణం.  ఇందిరా క్రాంతి పథకం ద్వారా  రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు వైఎస్  స్వయం సహాయక సంఘాల మహిళలకు పావల వడ్డీకే రుణాలు ఇప్పించి వాటితో వివిధ వ్యాపారాలు చేసుకునేలా వారిని పోత్సహించారు.  
 
మహిళలకు అభయం.. రాజన్న సాహసం
వైఎస్ చేసిన మరో సాహసం ‘అభయ హస్తం’. అసంఘటిత రంగంలోని మహిళలకు కూడా వృద్ధాప్యంలో ఆసరగా నిలిచే పింఛన్ పథకానికి  వైఎస్ శ్రీకారం చుట్టారు. ‘అభయ హస్తం’ పేరుతో మహిళల్లో ధైర్యం నింపారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న నిరుపేద మహిళలు నెల నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తే ప్రభుత్వం కూడా మరికొంత మొత్తాన్ని వేసి 60 ఏళ్లు దాటిన తర్వాత వారికి నెలా నెలా పింఛన్ అందేలా ఏర్పాటు చేయడమే అభయ హస్తం లక్ష్యం. 

పింఛన్.. ధైర్యమిచ్చెన్!
పాదయాత్రలో తెలుసుకున్న  సమస్యలకు చెక్ పెట్టాలనుకున్నాడు...  ఆదరణ కోల్పోయి జీవచ్ఛవాలుగా బతుకుతున్న దాదాపు 70 లక్షల మంది (ఉమ్మడి రాష్ట్రంలో) పింఛన్ పథకాన్ని విస్తరించిన ఘనత వైఎస్సార్ ది. 
 
‘ఇందిర ప్రభ’..పేదల జీవితాల్లో శోభ!
రాష్ట్రంలోని పేద ప్రజలకు ‘ఇందిర ప్రభ’పేరుతో భూములు పంపిణీ చేశారు. ఐదేళ్ల కాలంలో దాదాపు 6.5 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గిరిజనుల భూ పంపిణీ చట్టాన్ని దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేసి మొత్తం 13 లక్షల ఎకరాలు భూమిని పంపిణీ చేశారు. 

ఎన్నని చెప్పాలి... ఏవని చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ చేసిన పథకాలు చాంతాడంత ఉన్నాయి.
  • పశుక్రాంతి పథకం ద్వారా ఎక్కువ సబ్సీడీతో మేలు రకం పాడి పశువులను పంపిణీ చేశారు.
  • జీవ క్రాంతి పథకం ద్వారా గొర్రెలు, పొట్టేళ్ల పంపిణీ చేశారు. అంతేకాకుండా గొర్రెల కాపరులకు, గొర్రెలకు బీమా కల్పించారు. 
  • ఇందిరా జీవిత బీమా ద్వారా  వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించారు
  • రాజీవ్ యువశక్తి, రాజీవ్ ఉద్యోగ శ్రీ పథకాల ద్వారా చదువుకున్న నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించారు. రాష్ట్ర, దేశ చరిత్రలో ఎవరూ చేయలేని విధంగా ప్రజలకు సేవ చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిన వైఎస్ రుణం ఎప్పటికీ తీరనిది... తీర్చుకోలేనిది. 
Back to Top