<span style="text-align:justify">హైదరాబాద్: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని శ్రీకాంత్‌రెడ్డి కోరారు</span>