తాడేపల్లి: రాష్ట్ర రైతులు పండించిన అరటి పండ్ల ధర కిలో కేవలం 50 పైసలు మాత్రమే పలుకుతుండడం, ఉల్లిపాయల నుంచి టమాట వరకు ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కక అన్నదాతలు అవస్థ పడుతుండడాన్ని దేశం మొత్తానికి తెలియజేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వైయస్ఆర్‌సీపీఅధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పోస్టు చేశారు. అన్నదాతలకు దన్నుగా నిలవాల్సిన చంద్రబాబు సర్కారు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుండడాన్ని సూటిగా ప్రస్తావిస్తూ తీవ్రంగా ధ్వజమెత్తారు. అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు భారీఎత్తున ధర్నా చేస్తున్న ఫొటోలను ట్యాగ్ చేస్తూ ‘‘సేవ్ ఫార్మర్స్’’ హ్యాష్‌ట్యాగ్‌తో ‘‘హలో ఇండియా... ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఆ పోస్టులో ఆయన ఏమన్నారంటే.. హలో ఇండియా.. ఒకసారి ఏపీవైపు చూడండంటూ ట్వీట్ ‘‘హలో ఇండియా.. ఓ సారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి! కిలో అరటిపండ్లు కేవలం రూ.0.50కి అమ్ముడవుతున్నాయి! ఔను, మీరు విన్నది నిజమే, యాభై పైసలే. ఇదీ ఏపీలో అరటి రైతుల దుస్థితి.అగ్గిపెట్టె కంటే చౌక, ఒక బిస్కెట్ కంటే చౌక. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి, నెలల తరబడి కష్టపడి పనిచేసిన రైతులకు దక్కిన దారుణమైన ప్రతిఫలం ఇది. అరటిపండ్లు మాత్రమే కాదు, ఉల్లిపాయల నుంచి టమాట వరకు, ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. విపత్తుల సమయంలో ఉచిత పంటల బీమా లేదా ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చి, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని నమ్మబలికి మోసం చేశారు. చంద్రబాబు ప్రతి హామీ ఒక మోసమేనని నిరూపితమైంది. ⇒ వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అరటి పండ్లను టన్నుకు సగటున రూ.25 వేల ధరకు రైతులు అమ్ముకున్నారు. రైతులు ఎప్పుడూ నష్టపోకుండా చూసుకోవడానికి రాష్ట్రం నుంచి న్యూఢిల్లీకి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశాం. రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీలు నిర్మించాం. నాటి మా నిబద్ధత వేలాది కుటుంబాలను కాపాడింది. గిట్టుబాటు ధరలకు పంటల ఉత్పత్తులను విక్రయించుకుని లబ్ధి పొందేలా రైతులకు తోడుగా నిలిచాం. కానీ నేడు చంద్రబాబు రైతులను వారి ఖర్మకు వదిలేశారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుంటే మౌనరాగం ఆలపిస్తున్నారు. నేడు ఆహారం విలువ 50 పైసలైతే దానిని ఉత్పత్తి చేసే రైతుల శ్రమ విలువ ఎంత?’’ అని వైయస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ ట్వీట్‌తో చంద్రబాబు ఉలికిపాటు ‘‘హలో ఇండియా.. ఓ సారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి! అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఏపీలో రైతుల దుస్థితి తెలుపుతూనే.. సేవ్ ఏపీ ఫార్మర్స్ (#SaveAPFarmers) పేరుతో సదీర్ఘమైన పోస్ట్ ఒకటి ఉంచారాయన. అయితే.. వైయస్ జగన్ ట్వీట్‌తో చంద్రబాబు ప్రభుత్వం భుజాలు తడుముకుంటోంది. సాధారణంగా వైయస్ జగన్ ప్రెస్‌మీట్ పెట్టినా.. ఏదైనా ట్వీట్ చేసినా వెంటనే మీడియా ముందుకు వచ్చి అబద్ధపు ప్రకటనలు చేయడం టీడీపీ అండ్ కోకు అలవాటుగా మారింది. ఇప్పుడు ఆయన చెప్పిన లెక్కలు సరైనవి కావడం, పైగా కళ్ల ముందు ప్రత్యక్షంగా పరిస్థితులు కనిపిస్తుండడంతో ఖండించలేని స్థితిలో ఉండిపోయింది. మరోవైపు.. కిలో అరటిపండ్లను రైతుల నుండి కొంటున్నది కేవలం 50 పైసలకే!. ఒక అగ్గిపెట్టె, ఒక బిస్కెట్ కంటే కూడా అరటిపండ్లు చౌక. అనంతపురం కలెక్టరేట్‌ను అరటి రైతులు ముట్టడించడాన్ని ప్రధానంగా ఉద్దేశిస్తూ వైయస్ చేసిన ట్వీట్‌లో మచ్చుకు రెండు లైన్లు మాత్రమే. అవి వాస్తవాలు కావడంతో ఎలా కవరింగ్ చేసుకోవాలో అర్థంకాక ఇటు ఎల్లో మీడియా అవస్థలు పడుతోంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి.. నెలల తరబడి కష్టపడి వ్యవసాయం చేస్తే.. చివరికి రైతులకు దక్కే ప్రతిఫలం ఇదేనా? అంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు. ఉల్లిపాయల నుంచి టమాట వరకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని పేర్కొంటూ ఏపీ అన్నదాతలు అవస్థలను దేశం దృష్టికి తీసుకెళ్లారాయన. అలాగే.. అన్నదాతలకు దన్నుగా నిలవాల్సిన చంద్రబాబు సర్కారు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుండడాన్ని సూటిగా ప్రస్తావిస్తూ తీవ్రంగా ధ్వజమెత్తారు. 📢 HELLO INDIA, LOOK TOWARDS ANDHRA PRADESH! One kilogram of bananas is being sold for just Rs 0.50! Yes, you heard it right, fifty paise. This is the plight of banana farmers in AP. Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who invest lakhs of rupees and months of hard work, only to receive pain in return. Not only bananas, from onions to tomatoes, no crop is receiving remunerative prices. Neither free crop insurance nor input subsidies during calamities, nor the promised cultivation support. Everything proved to be a farce. During our previous tenure, the price of bananas was maintained at an average of Rs 25,000 per ton and special trains were arranged from the state to New Delhi to ensure farmers never incurred losses. That commitment saved thousands of families, and cold storages were constructed across the state to protect farmers from distress sales. But today, Chandrababu has abandoned farmers to their fate, watching silently as agriculture crumbles. If food is worth Rs 0.50 today, what is the value of the hands that grow it? #SaveAPFarmers