కూటమి నేతృత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన.

‘అత్యాచారాంధ్ర ప్రదేశ్’గా ఏపీ:

కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, గుంటూరు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా, మహిళా విభాగం నేత పుణ్యశీల.

రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువు.

ఇంట్లో ఉన్నా కత్తితో బెదిరించి అఘాయిత్యాలా?

22 నెలల కూటమి పాలనలో గాల్లో దీపంలా మహిళా భద్రత

నిప్పులు చెరిగిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు.

వైయస్.జగన్ హయాంలో 'దిశ' భరోసా.

కూటమి పాలనలో 'దోషుల'కు వత్తాసు

కూటమి నేతలే అరాచకవాదులు.

మహిళలపై దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?

సూటిగా నిలదీసిన వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం నేతలు.

తాడేపల్లి:  ఆంధ్ర రాష్ట్రంలో మహిళల భద్రత గాల్లో దీపంలా మారిందని, కూటమి ప్రభుత్వ 22 నెలల పాలనలో ఆడబిడ్డలకు మాన, ప్రాణాలకు కనీస రక్షణ లేకుండా పోయిందని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, మహిళా విభాగం నేత పుణ్యశీల లు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మీడియాతో మాట్లాడుతూ... మహిళా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. 
ఈ సందర్బంగా ఏవరేమన్నారంటే... 

● వరుదు కల్యాణి - వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు:

- "మహిళల భద్రతను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం"

కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయి, రాష్ట్రం ‘అత్యాచారాంధ్రప్రదేశ్’గా మారింది. పల్నాడు జిల్లా మాచర్లలో ఒంటరి మహిళను కత్తితో బెదిరించి, కాళ్లు చేతులు కట్టేసి అత్యాచారం చేయడం అత్యంత పాశవికం. చంద్రబాబు ప్రకటనలు తప్ప తీసుకుంటున్న చర్యలేమీ లేవు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యే మహిళను మోసం చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో డ్రగ్స్ డోర్ డెలివరీ అవుతున్నాయి,  దీనివల్ల కామాంధులు రెచ్చిపోతున్నారు. వైయస్.జగన్ హయాంలో మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సీఏం చంద్రబాబు, హోంమంత్రి అనిత, డీజీపీతో సహా అందరూ రాష్ట్రంలో మహిళల భద్రతను గాలికొదిలేశారనడానకి ఈ ఘటనలో నిదర్శనం. వైయస్.జగన్ హయాంలో మహిళల రక్షణ కోసం దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ ఉండేవి. ఇవాల అన్నీ నిర్వీర్యమయ్యాయి. కూటమి పాలనలో మహిళల మీద అఘాయిత్యాలు చేసిన వారికి సరైన శిక్షలు వేయకపోవడం వల్లే పదే, పదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మహిళలు పనిచేసే ప్రదేశంలోనైనా, ఇంట్లో ఉన్నా, స్కూల్లో ఉన్న రక్షణ లేకుండా పోతుంది. దీనికి మద్యం, మత్తు పదార్ధాలే కారణం. డ్రగ్స్ డోర్ డెలివరీ జరుగుతుంది. దీనివల్ల కామాంధులు రెచ్చిపోతున్నారు.  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యే అఘాయిత్యంపై చర్యలు తీసుకోవడం లేదు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాను.  ఇప్పటికైనా కూటమి నేతలు స్పందించి, కళ్లు తెరిచి మహిళలు మీకు బుద్ధి చెప్పే టైం దగ్గర్లోనే ఉందని వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

● కాకాణి పూజిత - వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ 

- "పోలీసుల ముందే దాడులు.. ఇదేనా కూటమి సాగించే ఆటవిక రాజ్యం?"

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వల్ల అన్యాయానికి గురైన మహిళపై పోలీసుల ముందే ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం సిగ్గుచేటు. అధికారం లేనప్పుడు ఆడబిడ్డల కోసం తాడు తీస్తానన్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేపై విచారణ పేరుతో కాలయాపన చేయడం సమంజసమా? ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయింది. తమకు అన్యాయం జరిగిందని బయటకు వచ్చినా, ప్రశ్నించినా, తిరిగి బాధితులపైనే అక్రమ కేసులు మోపుతున్నారు. తప్పు చేసిన వాళ్లు బయట నిర్భయంగా తిరుగుతున్నారు. కూటమి ఎమ్మెల్యేలు ఇంతటి దారుణాలకు ఒడిగడుతున్నా వారి మీద చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. రైల్వే కోడూరు  కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కారణంగా బాధించబడ్డ మహిళకు నేటికి న్యాయం జరగలేదు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉదంతంపై నేటికి వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ నోరు విప్పడం లేదు. కూటమి ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ అంటూ కాలం వెల్లదీస్తున్నారే తప్ప చర్యలు తీసుకునే సాహసం చేయడం లేదు. రాష్ట్రంలో ఒక మహిళ హోం మంత్రిగా ఉండి కూడా పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు రెండోస్థానం దక్కడం రాష్ట్రంలో శాంతిభద్రతలు కనుమరుగయ్యాయన్న దానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటుతో వైయస్.జగన్ హయాంలో మహిళలు సురక్షితంగా ఉండేవారు. త్వరలోనే ప్రజలు కూటమికి బుద్ధి చెబుతారని కాకాణి పూజిత హెచ్చరించారు.

● నూరి ఫాతిమా - గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త:

- "ఇంట్లో ఉన్నా మహిళలకు రక్షణ లేని పరిస్థితి"

రాష్ట్రంలో ఆడపిల్లలను బయటకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది.  కూటమి నేతలు మహిళలకు ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయి. సుగాలీ ప్రీతికి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడిన వారు, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలపై ఎందుకు నోరు విప్పడం లేదు. వైయస్.జగన్ హయాంలో దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా మహిళలకు కొండంత అండ ఉండేది, నేడు ఆ భరోసా కరువైంది. 

● పుణ్యశీల - వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేత.

- "శాంతిభద్రతల్లో అట్టడుగున ఏపీ.. నిశ్శబ్ద హోంమంత్రి అనిత"

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కేవలం సోషల్ మీడియా ట్వీట్లకే పరిమితమయ్యారే తప్ప... 22 నెలలుగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కనీసం స్పందించడం లేదు. వైయస్.జగన్ హయాంలో పోలీస్ శాఖకు 59 స్కోచ్ అవార్డులు వస్తే, నేడు దేశంలోనే అత్యంత చెత్త పనితీరుతో ఏపీ అట్టడుగు ర్యాంకులో ఉండటం సిగ్గుచేటు. 
హోంమంత్రి అనిత తన శాఖ బాధ్యతలు విస్మరించి చంద్రబాబు భజన చేస్తూ, వైయస్.జగన్  తిట్టడమే పనిగా పెట్టుకుంది. రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలపై మాత్రం కనీసం నోరు మెదప కుండా నిశ్శబ్ద హోంమంత్రిగా మిగిలిపోయింది.  ఆమెకు సీఎం ఇచ్చిన లాస్ట్ ర్యాంకే ఆమె పనితీరుకు నిదర్శనం.  ఇప్పటికైనా ప్రభుత్వం పల్నాడు, మాచర్లలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బాధితుల పక్షాన నిలిచి రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Back to Top