కర్నూలు: జిల్లాలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. వైయస్ఆర్‌సీపీ నాయకులను టార్గెట్ చేసుకొని టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈనెల 14వ తేదీన వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి కూటమి ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పై విమర్శలు చేశారని త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి టిజి భరత్. ఓ ఫార్మా కంపెనీ వద్ద మంత్రి భరత్ 45 కోట్ల రూపాయలు వసూలు చేశారని బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఆరోపించారు. దాంతో తనపై, నారా లోకేష్ పై సిద్దార్థ రెడ్డి చేసిన ఆరోపణలకు స్పందించి కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మంత్రి టిజి భరత్. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు చేసిన త్రీ టౌన్ పోలీసులు. బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డిపై కేసు నమోదు రాజకీయ కక్షసాధింపే వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు రాజకీయ కక్షసాధింపు చర్యగా వైయస్ఆర్‌సీపీ నేతలు తప్పుపట్టారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఫిర్యాదు మేరకు స్పందించిన త్రీటౌన్ పోలీసులు బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ చర్యను వైయస్ఆర్‌సీపీ నేతలు రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తూ, ప్రతిపక్ష స్వరాలను అణచివేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పార్టీ నేతలు మండిపడ్డారు.