అవినీతి సొమ్ముతోనే నంద్యాలలో టిడిపి గెలుపు

వెంకటాచలం: మూడేళ్ల టిడిపి పాలనలో దోచిన అవినీతి సొమ్ముతోనే నంద్యాలలో గెలవగలిందని తిరుపతి ఎంపీ ఎం.వరప్రసాద్‌ విమర్శించారు. వెంకటాచలం మండలంలోని చెముడుగుంట స్రిడ్స్‌ కల్యాణమండపంలో సర్వేపల్లి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపి నవరత్నాల సభ నిర్వహించారు. ఈసభలో సీఎం చంద్రబాబు, టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. చంద్రబాబు లాంటి మోసపూరిత సీఎంను దేశ చరిత్రలలో ఎన్నడూ చూడలేదన్నారు. ఆయన చేసే మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని తెలియజేశారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరుతో కమీషన్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బాబుపాలనలో గ్రామాల్లో అభివృద్ది పూర్తిగా కుంటుపడిపోయిందని తెలియజేశారు. ఎమ్మెల్యేలకు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులకు నిధులు ఇవ్వకుండా బాబు పాలన కొనసాగుతుందని విమర్శించారు. ఓడిపోయిన వ్యక్తులకు, జన్మభూమి కమిటీలకు పెత్తనం అప్పగించడంతో సంక్షేమ పథకాలు అర్హులకు అందడంలేదని తెలియజేశారు. దివంగత సీఎం వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాష్ట్రంలో పరిపాలన స్వర్ణయుగంలా సాగిందన్నారు. అర్హులున్న ప్రతీ ఓక్కరికీ వైయస్‌ఆర్‌ సంక్షేమ పథకాలను అమలుచేస్తే బాబు పాలనలో జన్మభూమి కమిటీ పెత్తనాలతో పథకాలు అమలు జరుగుతున్నాయని విమర్శించారు. వైయస్‌ఆర్‌ ఆలోచనలకనుగుణంగా వైయస్‌ఆర్‌సీపి అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో నవరత్నాల లాంటి తొమ్మిది హామీలతో ప్రజల ముందుకు పోతున్నాడని తెలియజేశారు. ఈ నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసే బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందని  సూచించారు. రాబోయే రెండుసంవత్సరాలు చాలా ముఖ్యమైన రోజులుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భావించాలని తెలియజేశారు. నంధ్యాల ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిని పక్కనబెట్టి వచ్చే ఎన్నికలే లక్ష్యంగా అందరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Back to Top