టీడీపీ మునిగిపోయే నావ

విజయనగరం : టీడీపీ మునిగిపోయే నావ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజన్న దొర ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని సర్వేలు చెబుతున్నాయని రాజన్న దొర వెల్లడించారు. విజయనగరం జిల్లా సాలూరులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, పెన్మత్స సాంబశివరావు, ఎమ్మెల్యేలు రాజన్నదొర, పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ... 2004లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేశారని చెప్పారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ప్రజలను మోసం చేయడానికే పాదయాత్ర చేశారని మండిపడ్డారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన ఏకైక సీఎం చంద్రబాబు అని పుష్పశ్రీవాణి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Back to Top