అరాచకపాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది

నిజాంపట్నంః రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, దీనికి ప్రజలు త్వరలో చరమగీతం పాడనున్నారని వైయస్సార్‌ సీపీ నాయకుడు, మండల ఎంపీటీసీ సభ్యుల ఫోరం అధ్యక్షుడు నర్రా సుబ్బయ్య అన్నారు. రేపల్లె నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ ప్లీనరీకి నిజాంపట్నం నుంచి ద్విచక్రవాహనాలపై భారీ ర్యాలీగా తరలివెళ్ళారు. ఈ ర్యాలీని వైఎస్సార్‌ సీపీ నాయకులు నర్రా సుబ్బయ్య, మోపిదేవి హరనాధబాబులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్రా సుబ్బయ్య మాట్లాడుతూ అధికారమే లక్ష్యంగా అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజా సమస్యలను విస్మరిస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న రాజ్యం తిరిగి రావాలంటే జగనన్నతోనే సాధ్యమని తెలిపారు. జగన్మోహనరెడ్డిని సీఎం చేసేందుకు ప్రజలంతా సమాయత్తం అవుతున్నారని, త్వరలోనే టీడీపీకి బుద్ధి చెప్పనున్నారని తెలిపారు. ర్యాలీలో వైఎస్సార్‌ సీపీ నాయకులు నాజర్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

Back to Top