అసెంబ్లీ సాక్షిగా టీడీపీ రౌడీయిజం

  • ప్రతిపక్షం గొంతు నొక్కిన సర్కార్
  • మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేల వీరంగం
  • వైయస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యేలపై దాడికి యత్నం
  • గిడ్డి ఈశ్వరి మాట్లాడుతుండగా మైకులను లాగేసిన పచ్చ ఎమ్మెల్యేలు
  • గౌరవ వైయస్సార్సీపీ మహిళా సభ్యులపై దురుసు ప్రవర్తన
  • చంద్రబాబు మహిళా ద్రోహిః వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు
ఏపీ అసెంబ్లీ: ఏపీ సీఎం చంద్రబాబు మహిళా ద్రోహీ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. మంగళవారం ఆమె ప్రశ్నోత్తరాల సమయంలో మహిళా సమస్యలపై మాట్లాడుతుండగా మైక్‌ కట్‌ చేసి టీడీపీ సభ్యురాలు అనితకు ఇవ్వడం పట్ల ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సభను వాయిదా వేయడంతో మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడేందుకు వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ సభ్యులను టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగలడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న చర్చలో తాను మాట్లాడుతుండగా మైక్‌ కట్‌ చేసి మధ్యలో టీడీపీ ఎమ్మెల్యే అనితకు అవకాశం కల్పించి తిట్టించారు. వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్‌ చేసిన దాడి, నారాయణ కాలేజీలో జరుగుతున్న ఆత్మహత్యలపై  తాను ప్రశ్నిస్తే అడ్డుకున్నారు. మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో బడుగు, బలహీన వర్గాల మహిళలు బలి అయ్యారు. అక్వా ఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో మహిళలపై ఉక్కుపాదంతో అణచివేయడం, మహిళా పార్లమెంటరీ సదస్సుకు మమ్మల్ని ఆహ్వానించి రోజాను అవమానించారు. ప్రజల ఆమోదంతో చట్టసభకు వచ్చి ప్రజల గొంతును వినిపిస్తుంటే తమపై ఎదురుదాడి చేస్తున్నారు.ఆ క్రమంలో దేశంలో ఎక్కడ జరగని విధంగా ఏడాది పాటు సస్పెండ్‌ విధించడం టీడీపీ మహిళా సభ్యులు సమర్ధించుకుంటున్నారు. ఎస్సీ మహిళా సర్పంచ్‌ను సభకు వెళ్లకుండా పోలీసులు నిర్భందించడం వాస్తవం కాదా? చంద్రబాబు తల నరికే ఎమ్మెల్యే అని నాపై ఆరోపణలు చేస్తున్నారు. నేను అనని మాటలను అన్నట్లు మాట్లాడుతున్నారు. బాబు ఇచ్చిన జీవోను రద్దు చేయకుండా టీడీపీ ఎమ్మెల్యే అనిత ప్రతిసారి అడ్డుతగులుతున్నారు. చంద్రబాబు మహిళా ద్రోహీ, మహిళలపై వివక్ష చూపుతున్నారు. మహిళలపై జరుగుతున్న దాడులకు సీఎం బాధ్యత వహించాలి. మహిళలకు అండగా ఉంటాం. ఈ రోజు టీడీపీ దౌర్జన్యాలను అడ్డుకుంటాం. ఇంత అన్యాయంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని గిడ్డి ఈశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
––––––––––––––––
సమాధానం చెప్పలేక పిరికిపందల్లా పారిపోతున్నారు
ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
ఏపీ అసెంబ్లీ: మహిళల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని మహిళలే బంగాళఖాతంలో కలుపుతారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి హెచ్చరించారు.  మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీలో మహిళలపై జరుగుతున్న దాడులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని  ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నిస్తే.... సరైన సమాధానం చెప్పలేక అధికార టీడీపీ పిరికిపందల్లా సభను వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. వనజాక్షికి న్యాయం చేయాల్సిన పభుత్వం అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషితేశ్వరి విషయంలోనూ, నారాయణ కాలేజీల్లో అమ్మాయిలు ఏవిధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అందరికి తెలుసు అన్నారు.  సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా టీడీపీ సభ్యులు సభలో మాట్లాడటం సిగ్గుచేటు. ఇలాంటి దౌర్భగ్యమైన ప్రభుత్వం ఉండటం అవమానకరం. ఏరకంగా మాపై దాడులు చేస్తున్నారో గమనించాలని కోరారు. మహిళలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి బంగాళఖాతంలో కలుపుతారని హెచ్చరించారు.
.............................................................
మీడియా పాయింట్‌లో అడ్డుకోవడం సిగ్గుచేటు
ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి
వెలగపూడి: అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ప్రతిపక్ష గిరిజన మహిళా ఎమ్మెల్యేలను మాట్లాడనివ్వకుండా చంద్రబాబు సర్కార్‌ అడ్డుకోవడం సిగ్గుచేటని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి ధ్వజమెత్తారు. మహిళా సమస్యలపై ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధికార పార్టీని ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నలు కూడా పూర్తి కాకుండానే స్పీకర్‌ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మహిళా సమస్యలపై ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా మహిళలంటే గౌరవం లేని చింతమనేనికి 10 నిమిషాల సమయం ఇచ్చి మాట్లాడించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ప్రభుత్వం మహిళా వ్యతిరేకి అని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే రోజాను మహిళా సాధికారత సదస్సుకు ఆహ్వానం పంపి ఆ కార్యక్రమానికి రానివ్వకుండా ఎయిర్‌పోర్టులో కుట్రపూరితంగా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మహిళా సాధికారత అంటే అర్థం తెలుసా అని ప్రశ్నించారు. గిరిజన ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకుండా మహిళా సాధికారతను నీరుగార్చారని విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేలకు మీరిచ్చే గౌరవం ఇదేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వరు.. కనీసం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడనివ్వకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. 
Back to Top