దళితుల అభివృద్ధి పై చర్చకొచ్చే దమ్ముందా?

చంద్రబాబును దళితులెవరూ నమ్మడం లేదు
అందుకు దళితతేజం సభే నిదర్శం
లోకేష్‌ స్థాయి తెలుసుకొని మాట్లాడితే మంచిది

నెల్లూరు: దళితులకు చేసిన అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీకి చర్చకు వచ్చే దమ్ముందా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాలు విసిరారు. రాష్ట్రంలో అడుగడుగునా దళితులను కించపరుస్తూ.. వారిపై దాడులకు తెగబడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి దళితే తేజం కార్యక్రమం నిర్వహించే అర్హత కూడా లేదన్నారు. నెల్లూరులో కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో టీడీపీ నిర్వహించిన దళిత తేజం కార్యక్రమానికి స్పందన కరువైందన్నారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, పొదుపు సంఘాల మహిళలను తీసుకువచ్చి బలవంతంగా సభలో కూర్చోబెట్టారన్నారు. దళితులు ఎవరూ సీఎం చంద్రబాబును నమ్మడం లేదని, అందుకు సభే నిదర్శనమన్నారు. కనీసం పది వేల మంది కూడా సభకు హాజరుకాలేదన్నారు. చంద్రబాబు చేతిలో మోసపోయిన వారిలో దళితులు, బలహీనవర్గాల ప్రజలే ఎక్కువ అని, వారే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. 

నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పోరాడే ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత మంత్రి లోకేష్‌కు లేదన్నారు. లోకేష్‌ మాట్లాడే ముందు తనస్థాయి ఏంటో తెలుసుకోవాలని కాకాణి సూచించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో లోకేష్‌ సర్పంచ్‌గా కూడా గెలవలేడని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌కు స్వర్గీయ ఎన్టీఆర్‌ భారతరత్న ఇప్పించారని చెప్పడం సరికాదన్నారు. దేశానికి చేసిన సేవలతో రత్నంలా అంబేద్కర్‌ ఎదిగారని గుర్తు చేశారు. ఆయనకు ఎవరి సిఫారసులు అవసరం లేదన్నారు. అదే విధంగా కడప ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేష్‌నాయుడు చేసిన దీక్షను సొంత పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విమర్శించారని, ఉక్కు దీక్ష కాదు.. తుక్కు దీక్ష అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. 
Back to Top