టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ

  • అధికార బలంలో నంద్యాలలో టీడీపీ బెదిరింపులు
  • అభివృద్ధితో కాకుండా ఆర్థిక లావాదేవిలతో గెలవాలనుకుంటున్నారు
  • సోమిరెడ్డి వ్యూహకర్త అయితే నాలుగు సార్లు ఎందుకు ఓడారు
  • నంద్యాల ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసి బాబుకు బుద్ధి చెప్పండి
  • వైయస్‌ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి
నంద్యాల:  ఎన్‌టీ రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ ఎప్పుడో కనుమరుగైందని, ఇప్పుడున్న టీడీపీ పార్టీ తెలుగు దొంగల పార్టీలా మారిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.  టీడీపీ అధికార బలంలో నంద్యాలలో బెదిరింపులకు తెర లేపిందని, బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులను పోలీసులకు అప్పగిస్తే..ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. శనివారం నంద్యాలలోని పార్టీ కార్యాలయంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో  ఏదైనా ఒక సంఘటన జరిగితే దాన్ని పక్కదారి పట్టించడం చంద్రబాబుకు బాగా ఆలవాటు అయ్యిందన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాల్సిన ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడి లబ్ధిపొందాలని చూడటం సిగ్గు చేటు అన్నారు.  సొంత డబ్బుతో రోడ్లు వేస్తున్నట్లు సీఎం చెప్పుకోవడం శోచనీయమన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో అధికార బలంతో, బెదిరింపులు, ప్రలోభాలతో గెలవాలని చూస్తుందన్నారు. ఏదో విధంగా అందర్ని ప్రలోభపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు ఆయన కుటుంబ సభ్యులు కూడా నమ్మరని, సీఎం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. 

బాబుది నీతిమాలిన, నయవంచన పాలన
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో నీతిమాలిన, నయవంచన పాలన సాగుతుందని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. బాబు నోటితో నీతులు చెబుతారని, మనసులో మలినమైన పనులు చేస్తుంటారని ఎద్దేవా చే శారు. ఆసలు ఆయనకు హుందాతనం అనే పదానికి అర్థం తెలుసా అని ప్రశ్నించారు. బాబు లాంటి అవినీతిపరుడు, నయవంచకుడు ఎవరు ఉండరన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావును ఎన్నుపోటు పొడిచి ఆ పార్టీని హస్తగతం చేసుకున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. ప్రజల్లోకి వెళ్లి ఎప్పుడు దోచుకుందామా, అందుకోసం ఏంతైనా ఖర్చు చేద్దామా అన్నదే బాబు మనస్తత్వం అన్నారు. బాబు మాట్లాడే మాటలను ప్రజలు అసహ్యంచుకుంటున్నారని తెలిపారు. ఆత్మస్తుతి, పర నిందతో బతికే వ్యక్తి అంటే ఎవరంటే అది చంద్రబాబే అన్నారు.

వైయస్‌ జగన్‌ను చూసి నేర్చుకో
వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి విలువలతో కూడిన రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని చంద్రబాబుకు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచించారు. బాబులా వైయస్‌ జగన్‌ అనైతిక రాజMî యాలు చేయరని స్పష్టం చేశారు. మూడేళ్లలో నీవు చేసిన అభివృద్ధి చూపించి నంద్యాలలో ఓట్లు అడగాలన్నారు. అలా కాకుండా బాబు తన వద్ద ఉన్న అవినీతిసొమ్ముతో, ఆర్థికలావాదేవీలతో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. వైయస్‌ జగన్‌ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని తెలిపారు. విశ్వసనీయ ఉన్న వ్యక్తినే ప్రజలు నాయకుడిగా స్వీకరిస్తారన్నారు. పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముసలివారి వరకు ఎవరినైనా మోసం చేసే ఘనుడు చంద్రబాబే అన్నారు.

స్వేచ్ఛగా ఓటు వేయండి
 నంద్యాల ఓటర్లు బెదిరింపులకు భయపడాల్సిన పని లేదని, స్వేచ్ఛగా ఓటు వేసి చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచించారు.  ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ప్రజల కోసం రాజకీయాలు చేసే వ్యక్తి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. బాబులా ఓటుకు కోట్లు కేసులో దొరిక హైదరాబాద్‌ నుంచి పారిపోయిన వ్యక్తి వైయస్‌ జగన్‌ కాదన్నారు.  నెల్లూరు జిల్లాకు చెందిన సోదిరెడ్డి, సోంబేరి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఒక్కడికి వచ్చి తాను వ్యూహకర్త అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అంత గొప్ప వ్యూహకర్త అయితే ఇప్పటివరకు వరుసగా 4 సార్లు ఎందుకు ఓడావని ప్రశ్నించారు. ప్రజలు టీడీపీ నేతల బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా ఓటు వేసి న్యాయానికి తోడుగా నిలవాలని కాకాణి గోవర్ధన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.  
Back to Top