టీడీపీ పెట్టుబడిదారులు కాబట్టే చర్యలు తీసుకోవడం లేదు

ఏపీ అసెంబ్లీ: తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు పెట్టుబడి పెట్టారు కాబట్టే వారు ఎలాంటి అనైతిక చర ్యలకు పాల్పడినా చంద్రబాబు చర ్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ ఆరోపించారు. మంగళవారం మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు.  శాసన సభలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీపై వాయిదా తీర్మానం ఇస్తే చర్చకు అంగీకరించకుండా ప్రతిపక్షం గొంతు నొక్కుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వైద్య రంగాలను ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ముందుకు తీసుకెళ్లాల్సి ఉండగా ఏపీలో విద్యా వ్యవస్థ మంత్రి నారాయణ చేతిలోకి వెళ్లిందని ఆరోపించారు. ఏ పత్రిక చూసినా నారాయణ కాలేజీ విద్యార్థుల ప్రభంజనం అంటూ ప్రకటనలు గుప్పిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను భ్రమలోకి నెట్టుతున్నారని విమర్శించారు. విద్యార్థులు చదవకుండానే పేపర్‌ లీక్‌ చేసి పరీక్షలు రాయించడం సరికాదు అన్నారు. నాడు గాలి ముద్దుకృష్ణమ నాయుడిని ఎలాగైతే తొలగించాలరో అలాగే మంత్రి నారాయణ, గంటా శ్రీనివాసులను భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఇద్దరు టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు పెట్టుబడి పెట్టడంతోనే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. వాయిదా తీర్మానంపై చర్చకు ప్రభుత్వం అంగీకరించాలని ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Back to Top