వైయస్ జగన్‌పై విమర్శలు అర్ధరహితం

ముదినేపల్లి రూరల్‌ః ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు పాదయాత్ర చేపడుతున్న వైయస్సార్‌ సీపీ అధినేత జగన్‌పై టీడీపీ నేతలు విమర్శలు చేయడం అర్ధరహితమని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నిమ్మగడ్డ భిక్షాలు అన్నారు. ముదినేపల్లిలో మంగళవారం మాట్లాడుతూ.... పాదయాత్రకు ఆటంకం లేకుండా కోర్టు వాయిదాకు మినహాయింపు కోరితే దీనిని రాజకీయం చేయడం టీడీపీ నేతల అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఆటంకాలు కల్పించినా జగన్‌ పాదయాత్ర విజయవంతంగా జరుగుతుందన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top