టీడీపీ కౌన్సిలర్లు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక


కర్నూలు:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులై, జననేత ప్రకటించిన నవరత్నాలతో రాజన్న రాజ్యం వస్తుందని విశ్వసిస్తూ రోజు రోజుకు అధికార పార్టీ నుంచి వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు మొదలయ్యాయి. తాజాగా కర్నూలు జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీకి చెందిన 19వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ లక్ష్మీదేవి, 13వ వార్డు కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌ వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వైయస్‌ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే ఐజయ్య,  నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డిల సమక్షంలో కౌన్సిలర్లు వారి అనుచరులతో కలిసి వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వారికి పార్టీ నాయకులు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం నందికొట్కూరులోని 16వ వార్డులో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణలో నాయకులు పాల్గొన్నారు. 
 
Back to Top