టీడీపీ ఎంపీటీసీలు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

నెల్లూరు: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎంపీటీసీ సభ్యులు  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సోమవారం అనికేపల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యులు పెద్ద పెంచలయ్య, కోసూరు పద్మ... నెల్లూరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. గతంలో వైయస్‌ఆర్‌సీపీ తరపున ఎన్నికైన పద్మ.. అధికార పార్టీ బెదిరింపులతో పచ్చకండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కోసం వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న పోరాటాలకు ఆకర్శితులై వైయస్‌ఆర్‌సీపీలో చేరినట్లు ఎంపీటీసీ సభ్యులు తెలిపారు.

Back to Top