బోడె ప్రసాద్‌పై కేసు నమోదు

అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని హైకోర్టు సూచించింది.  ఎమ్మెల్యే రోజా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో పోలీసుల తీరుపై  ఆర్కే రోజా హైకోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు హైకోర్టు స్పందించడం పట్ల వైయస్‌ఆర్‌సీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. బోడె ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు డిమాండు చేశారు.
 
Back to Top