టీడీపీ ఎమ్మెల్యే మోసం

శ్రీకాకుళం: రాష్ట్రంలో మహిళలపై టీడీపీ నేతలు సాగిస్తున్న మోసాలు, అరాచకాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. గజపతినగరం ఎమ్మెల్యే కె. అప్పలనాయుడు తనను మోసం చేశారంటూ శ్రీకాకుళానికి చెందిన ఎన్.ఛాయాకుమారి అనే మహిళ జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్‌కు ఫిర్యాదు చేశారు. రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే కొద్దిరోజుల వ్యవధిలో రూ.50 లక్షల వరకు లాభం వస్తుందని, ఇరీడియం రైస్‌పుల్లింగ్ కాయిన్ పేరిట ఓ ప్రాజెక్టు చేపట్టామని, ఇందులో టీడీపీ ఎమ్మెల్యే అప్పల నాయుడు కూడా భాగస్వామిగా ఉన్నారని దీప అనే మహిళ తనకు చెప్పడంతో డబ్బు చెల్లించానని ఛాయా తెలిపారు.
 
ఎమ్మెల్యే ఒత్తిళ్ల మేరకే డబ్బు చెల్లించానని, బ్యాంకు వివరాలు కూడా ఎమ్మెల్యే ఇచ్చారని తెలిపారు.   డబ్బుల కోసం ప్రశ్నిస్తుంటే తనను ఢిల్లీ, విజయవాడ, విశాఖ ప్రాంతాలకు తిప్పి చివరకు  అప్పలనాయుడు బినామీ  అయిన శ్రీనివాస్ అనే వ్యక్తి తనకు రూ.60 వేలు ఇచ్చి పంపించారన్నారు. ఘటనపై విచారిస్తామని ఎస్పీ చెప్పారు.  
Back to Top