టీడీపీకి వైయస్ జగన్ ఫోబియా

తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌ మంత్రులకు వైయస్ జగన్‌ ఫోబియా పట్టుకుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఢిల్లీ పర్యటనపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.  రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థికి మద్దతిస్తామని వైయస్‌ జగన్‌ చెప్పారు కానీ, బీజేపీతో కలుస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే జగన్‌పై మంత్రులు బురద జల్లుతున్నారని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. మంత్రి నారాయణ కుటుంబాన్ని పరామర్శించకుండా, జగన్‌పై విమర్శలకే సమయం కేటాయిస్తున్నారని ఎద్దేవా చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top