భూములు అమ్మాలన్నా టీడీపీ నేతలకు ముడుపులు

రైతులకు స్వేచ్ఛ లేకుండా పోయింది
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి

తూర్పుగోదావరి: కోనసీమలో భూములు అమ్మాలన్నా.. కొనాలన్నా రైతులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, టీడీపీ నేతలకు ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి దాపురించిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్యలు చెప్పుకునేందుకు రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. 191వ రోజు ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న చీర్ల జగ్గిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రవేశపెట్టిన భూముల రిజిస్ట్రేషన్‌ ఆన్‌లైన్‌ విధానం పూర్తిగా అవినీతిమయమైందన్నారు. సొంత భూములు అమ్ముకునే స్వేచ్ఛ కూడా రైతులకు లేకుండా పోయిందన్నారు. జిల్లాలో రిజిస్ట్రేషన్‌లు పూర్తిగా నిలిచిపోయాయన్నారు. అదే విధంగా కొబ్బరి రైతులు, కార్మికులు, అరటి కార్మికులు వైయస్‌ జగన్‌ను కలిసి వారి సమస్యలను వివరించనున్నారన్నారు. అదే విధంగా డ్వాక్రా సంఘాల మహిళలు వారి సమస్యలు విన్నవించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
Back to Top