టీడీపీ నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక

అనంత‌పురం:  జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీలో్కి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. నిత్యం ఎక్క‌డో ఒక చోట అధికార‌పార్టీ నేత‌లు టీడీపీని వీడి వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు, ఆయ‌న ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల‌కు ఆక‌ర్శితులై వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నారు.  జీ కొట్టాల గ్రామంలో 12 దళిత కుటుంబాలకు సంబంధించి 50 మంది వైయ‌స్ఆర్‌సీపీ నియో జకవర్గ సమన్వయకర్త వై వెంక టరామిరెడ్డి  సమక్షంలో టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌ సీపీలో చేరారు. పార్టీ కం డువాలతో వారిని వైవీఆర్‌  పార్టీ లోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారి లో ఈశ్వరయ్య, హనుమంతు, ఓబులేసు, ఆదినారాయణ, ఉలింద, లక్ష్మీదేవి, రమాదేవి, రాధమ్మ, తదితర కుటుంబాలవారున్నారు.    ప్రజాసంకల్పయాత్ర  చేస్తూ నిరంతరం ప్రజలకో సం శ్రమిస్తూ , ప్రత్యేకహోదా సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న వైయ‌స్‌ జగన్‌ పట్ల ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు వారు చెప్పారు. 

Back to Top