వైయస్‌ఆర్‌సీపీలోకి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు

నమ్మకం..విశ్వసనీయత.. జగన్‌ నైజం..
జననేత సంకల్పబలమే వైయస్‌ఆర్‌సీపీలోకి నడిపించింది..
గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ
విజయనగరంః వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి.  వైయస్‌ జగన్‌ సమక్షంలో గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. చిలుకలూరిపేట సమన్వయకర్త విడదల రజనీ ఆధ్వర్యంలో  గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది  శివన్నారాయణలతో పాటు చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు పార్టీలోకి చేరారు.ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలు నేడు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరడం చాలా సంతోషంగా వుందని చిలుకలూరిపేట వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త విడదల రజనీ అన్నారు.వైయస్‌ జగన్‌ పథకాలు, ఆయన ఆశయాలకు ఆకర్షితులై ఆయన వెంట నడవాలనే సంకల్పంతో సీనియర్‌ టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారన్నారు. నందమూరి తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసి..ఆ సమా«ధుల మీద నారావారి తెలుగుదేశానికి పునాదులు వేసి ఆ పునాదుల మీద తెలివిలేని తెలుగు రాని,పస లేని పనికి రాని తన పుత్రరత్నానికి ఒక బంగారు భవంతిని నిర్మించి ఇవ్వాలని తాపత్రాయం పడుతున్న చంద్రబాబుకు, ఆయనకు భజన చేస్తున్న నాయకుల ఆటకట్టించడానికే వైయస్‌ఆర్‌సీపీలోకి చేరామని గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ అన్నారు.  45 సంవత్సరాల క్రియశీలక రాజకీయ కాలంలో తెలంగాణ రహిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహిత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌..నేటి నవ్యాంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ ప్రజా నాయకుడికి రాని ప్రజా స్పందన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తుందన్నారు.ఒకప్పుడు భగిరథుడు వెంట జలప్రవాహం వస్తే..నేడు వైయస్‌ జగన్‌ వెంట జన ప్రవాహం వస్తుందన్నారు. 
 
Back to Top