జననేత సమక్షంలో పార్టీలోకి టీడీపీ నేతలు
తూర్పుగోదావరి: చంద్రబాబు మోసాలకు తాళలేక టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ సీపీలోకి వలసలు కడుతున్నారు. ప్రజా సమస్యల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ నేత సూర్యప్రకాష్, బీసీ మహిళా సంఘం నాయకురాలు జుత్తుక వరలక్ష్మి వారి అనుచరులతో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు జననేత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
Back to Top