వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన టిడిపి నేత

దెందులూరు : గుంటూరు జిల్లా గురజాలకు
చెందిన టిడిపినేత వై మురళీధర్ రెడ్డి వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ప్రజా
సంకల్పయాత్రలో ఉన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి
ఆహ్వానించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు కాసు మహేష్
రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ
తెలుగుదేశం హయాంలో సంక్షేమ కార్యక్రమాలు అటకెక్కాయని విమర్శించారు. జగన్ ద్వారానే
రాజన్న రాజ్యం సాధ్యం అని పేర్కొన్నారు.

Back to Top