<br/>గుంటూరు: గుంటూరు జిల్లాలో అధికార తెలుగు దేశం పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నిమ్మకాయల ఆదినారాయణ, సత్తెనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావులు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం సత్తెనపల్లెకు చేరుకున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వీరు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి వైయస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు అంబటి రాంబాబు, బాలశౌరి, ఎమ్మెల్యేలు ఉన్నారు.