దోపిడీకి సహకరించలేదని దాడులకు తెగబడిన పచ్చనేతలు

నెల్లూరు:

 అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తమ దోపిడీకి సహకరించని అధికారులపై ఏకంగా దాడులకు దిగుతున్నారు. తాజాగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దగదర్తి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్(ఆర్‌ఐ) కామాక్షిపై స్థానిక తెలుగుదేశం నేతలు ప్రతాపం చూపారు. ప్రభుత్వ భూముల్ని తమ పేరిట పట్టాలుగా మార్చాలన్న వారి వినతిని తోసిపుచ్చడమే ఆమె చేసిన తప్పు. తమ మాట విననందుకు బూతులు తిడుతూ.. దాడికి తెగబడ్డారు.  ‘చెప్పిన పని చేయకపోతే నీ అంతు చూస్తామంటూ జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర మనుషులం’ అని బెదిరించారు. ప్రభుత్వ రికార్డులు మార్చడం కుదరదని ఆర్‌ఐ తెగేసి చెప్పడంతో మహిళనీ చూడకుండా బూతులు తిట్టారు. ఇతర ఉద్యోగులు అడ్డుపడి వారిని అదుపు చేశారు. తనమీద జరిగిన దౌర్జన్యం పట్ల కామాక్షి కన్నీటి పర్యంతమయ్యారు. దౌర్జన్యానికి దిగినవారిపై ఈ నెల 13వ తేదీలోగా కేసులు నమోదుచేసి చర్యలు తీసుకోంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

Back to Top