వైయస్‌ఆర్‌సీపీలో చేరిన టీడీపీ నేత జొన్నభట్ల

కృష్ణా: అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. చంద్రబాబు పాలనపై అసహనంతో టీడీపీ నేతలంతా వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నారని పార్టీ సీనియర్‌ నేత సామినేని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేటకు చెందిన టీడీపీ నేత జొన్నభట్ల వెంకటసూర్యనారాయణ తన అనుచరులతో కలిసి వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు సామినేని ఉదయభాను వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
Back to Top