ప్రజాదరణ చూసి ఓర్వలేక వైయస్‌ జగన్‌పై విమర్శలు

చిత్తూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నాయకులు తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, వాటిపై పోరాటం చేస్తున్న వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను బాబు తన అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. మూడేళ్ల టీడీపీ పాలనలో రెండు లక్షల కోట్ల రూపాయల  అవినీతి చోటు చేసుకుందన్నారు. వీటిపై విచారణ చేపడితే బాబు, ఆయన కుమారుడు లోకేష్‌ జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. 

తాజా ఫోటోలు

Back to Top