నవరత్నాలతో టీడీపీ పతనం

జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి
కుమారప్రియం(పెదపూడి): వైయస్సార్‌ రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన వైయస్సార్‌ కుటుంబం, నవరత్నాలు పథకాలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ పతనానికి నాంది కాబోతున్నాయని జిల్లా అధికారప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి తెలిపారు. కుమారప్రియం గ్రామంలో వైయస్సార్‌ కుటుంబం, నవరత్నాలు కార్యక్రమాన్ని 197 బూత్‌ పరిధిలో బూత్‌ కన్వీనర్, పార్టీ మండల కార్యదర్శి అనసూరి రాంబాబు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. వైయస్సార్‌ కుటుంబం, నవరత్నాల సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి అమలు చేయకుండానే ఇంటింటికి తెలుగుదేశం చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయా బూత్‌ల పరిధిలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు టీడీపీ వైఫల్యాలను వివరించాలన్నారు. అనంతరం నవరత్నాల కరపత్రాలను అందించారు. రాష్ట్ర ఎస్సీ సెల్‌ సంయుక్త కార్యదర్శి మోకా సూరిబాబు, గ్రామ కన్వీనర్‌ తోటకూర పెద వెంకట్రావు, బిక్కవోలు మండల అధికార ప్రతినిధి మానుకొండ సాగర్‌రెడ్డి, పార్టీ మండల కార్యదర్శి లంక జానకి రామయ్య, పార్టీ నాయకులు నున్న సుబ్బారావు, అంబటి వెంకటేశ్వరరావు, తోటకూర భీమన్న, పెంటపాటి నాగన్న, జి.ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top