రాజధానిలో టీడీపీ భూ కుంభకోణాలు

పచ్చరాబంధుల అవినీతి బాగోతం
రాజధాని ముసుగులో లక్షల కోట్ల భూదోపిడీ
పేద రైతులను బెదిరించి 25 వేల ఎకరాలు కాజేసిన వైనం
చంద్రబాబు సారథ్యంలో తమ్ముళ్ల భూదందా
దళిత రైతుల అసైన్డ్ భూములు కైంకర్యం
బినామీ పేర్ల మీద చౌకగా భూ కొనుగోళ్లు

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని రాబంధుల పాలైంది. ఒకరు కాదు ఇద్దరు కాదు... అధికార పార్టీ నేతలందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అడ్డగోలుగా భూదోపిడీకి తెగబడ్డారు. రాజధాని ప్రాంతంపై తొలి కేబినెట్ సమావేశంలోనే తీసుకున్న నిర్ణయాన్ని దాచిపెట్టి... పూటకోమాట, రోజుకో ప్రకటనతో ప్రజల్లో గందరగోళం సృష్టించారు. అసైన్డ్, లంక భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదంటూ ప్రచారం చేయించి ప్రజలను  భయాందోళనలకు గురిచేశారు. ఆపైన రైతులను మభ్యపెట్టి, మాయచేసి... మాట వినని పేద రైతులను బెదిరించి, పంటలు తగలబెట్టి.... రహస్యంగా నిర్ణయించిన రాజధాని ప్రాంతంలో 25 వేల ఎకరాలకు పైగా భూములు కొట్టేశారు. 



లక్షల కోట్ల రూపాయలు లూటీ..
29 గ్రామాల్లోని రైతులకు అతి తక్కువ ధరలు చెల్లించి అప్పనంగా భూములు దోచుకున్నారు.  ఆ తర్వాత రాజధాని ప్రాంతాన్ని ప్రకటించడంతో ఆ భూములకు రెక్కలు వచ్చాయి. నాలుగైదు లక్షల రూపాయలకు కొన్న భూములు రూ. నాలుగైదు కోట్లు ధర పలుకుతున్నాయి. రాజధాని పేరుతో అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడి రూ. లక్షల కోట్లకుపైగా లూటీ చేసిన  చంద్రబాబు అండ్ కో భూ దురాగతమిది. ఇప్పటికి బయల్పడింది గోరంతే... ఊహించని స్థాయిలో జరిగిన అసలు దోపిడీ ఎంతనేది ఇంకా తేలాల్సి ఉంది...


పచ్చ రాబంధుల అవినీతి పుట్ట
రాజధాని ముసుగులో టీడీపీ నేతలు సాగిస్తున్న భూదోపిడీపై వైఎస్సార్సీపీ ముందు నుండి పోరాడుతూనే ఉంది. చంద్రబాబు డైరక్షన్ లో పచ్చనేతలు సాగిస్తున్న భూ దురాక్రమణలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడుతూ వస్తోంది. ఇంతింతై వటుడింతై అన్నట్లు సాగిన చంద్రబాబు అండ్ కో అవినీతి బాగోతం బట్టబయలైంది. పేదల పొట్టకొట్టి 25 వేల ఎకరాలను మింగేసిన పచ్చ రాబంధుల పాపాల పుట్టను చూసి రాష్ట్ర ప్రజానీకం నివ్వెరపోయింది. 



చంద్రబాబు డైరక్షన్ లో తమ్ముళ్ల భూదందా
రాజధాని హామీలన్నీ బూటకమని తేలిపోయాయి. పరిహారం పచ్చిదగా...నివాస-వాణిజ్య స్థలాలు నయవంచన. బాబు బినామీలే భూ రాబంధుల అవతారం ఎత్తారు. టీడీపీ పెద్దలంతా కలిసి పక్కాగా ప్లాన్ వేసి..రాజధాని అనే బూచి చూపి యథేశ్చగా దోపిడీకి పాల్పడ్డారు. చేతికి మట్టి అంటకుండా ..రైతుల భూమల నుంచి లక్షల కోట్ల రూపాయలు దండుకునే పథకం తయారుచేసి బ్రహ్మాండంగా అమలు చేశారు. చంద్రబాబు డైరక్షన్లో బినామీలంతా తమ నాటకాన్ని రక్తికట్టించారు. 



బినామీ పేర్ల మీద భూదోపిడీ
రాజధానిలోని భూముల్లో చంద్రబాబు ఒక్కో బిట్టుకు ఒక్కో బినామీని సృష్టించారు. పార్టీ ఆఫీసులు, సొంత ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల పేర్ల మీద..స్నేహితులు, బంధువులు, అనుచరులు, భాగస్వామ్యులు, ఇంట్లో పనివాళ్ల పేర్లమీద వందల ఎకరాలకు జీపీఏలు, అగ్రిమెంట్లు సృష్టించారు. రాజధాని ఎక్కడ నిర్మిస్తారనే దానిపై లీకులిచ్చి, రైతులను రియల్ మోసం చేయడంతో మొదలైన టీడీపీ కుట్రలు..సమీకరణకు ముందే రైతుల భూములు కొట్టేయడం దగ్గర్నుంచి పరిహారం రాదంటూ దళిత రైతులను భయపెట్టి కారుచౌకగా అసైన్డ్ భూములు నొక్కేయడం వరకు కుతంత్రాలు సాగాయి. 



జోన్లలో మాయాజాలం
ఏపీ రాజధానిపై చంద్రబాబు బినామీలకు ముందే లీకులు ఇచ్చి...గుట్టుచప్పుడు కాకుండా భూముల కొనుగోళ్లు జరిపారు. జోన్లలోనూ మాయాజలం చేశారు. ఎక్కడ ఏ జోన్ రావాలో వారే నిర్ణయించేసుకున్నారు. బాబుల బినామీ భూములను కమర్షియల్, డెవలప్ మెంట్ జోన్లలో వేసి...పేద రైతుల భూములను గ్రీన్ జోన్ లో పడేశారు. పచ్చ రాబంధులు తమ భూములకు ఎకరం నాలుగు కోట్లు పలికేలా చేసి...రైతుల భూములు ఎకరం కేవలం రూ. 20 లక్షలు పలికేలా మాయజేశారు. 

Back to Top