రైతులను అడుగడుగునా మోస‌గిస్తున్న టీడీపీ ప్రభుత్వం

అమరావతిః అరుగాలం కష్టించి పనిచేసి రాష్ట్రానికి అన్నంపెట్టే అన్నదాతను టీడీపీ ప్రభుత్వం అడుగడుగునా మోస‌గిస్తూ వ‌స్తుంద‌ని పెదకూరపాడు నియోజకవర్గ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కావటి మనోహరనాయుడు అన్నారు.  అమరావతిలో కావ‌టి రైతుదీక్ష వాల్‌పోష్టర్‌లను అవిష్కరించిన అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి వ్యవసాయ రుణాలన్నింటిని భేషరతుగా రద్దు చేశార‌ని గుర్తు చేశారు. 2014 ఎన్నిక‌ల్లో రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీన ఇచ్చి చంద్ర‌బాబు గాలికొదిలేశాడ‌న్నారు. వాతావరణం అనుకూలించక పంటలు పండక రైతులు నష్టపోవటం చూశాంగాని, రైతులు కష్టించి సాగేచేసి పంట పండించినప్పటికీ గిట్టుబాటు ధర లేక నష్టపోవటం ఇప్పుడే చూస్తున్నామన్నారు. వ్యవసాయం దండగ అన్న సీఎం  చంద్రబాబు మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా వారి అత్మహత్యల‌కు కారణమౌతున్నారన్నారు. ఇసుక, మట్టి ఇలా ఒకటేమటి దేవుడు మాన్యాలను అమ్ముకునే టీడీపీ నాయకులు చివరకు మిర్చి రైతులకు తక్కువ ధరకు అందించాల్సిన విత్తనాలను కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు అధిక ధరల‌కు అమ్ముకుని సొమ్ముచేసుకున్నారన్నారు. మిర్చి రైతును ఆదుకోవటానికి, రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవటానికి జననేత వైయ‌స్‌ జగన్మోహనరెడ్డి మే 1, 2 తేదీలలో గుంటూరు మిర్చి యార్డు సమీపంలో రైతుదీక్ష చేపట్టారన్నారు. మండల పరిధిలోని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీలకు అతీతంగా రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 

తాజా ఫోటోలు

Back to Top