విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు

నెల్లూరుః ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీస్ సెంటర్ లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయవర్థన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...వైయస్ఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని చంద్రబాబు తన చేతగాని తనంతో నీరుగారుస్తున్నారని మండిపడ్డారు.  ప్రభుత్వం విద్యార్థి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ లను ముట్టడిస్తామన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Back to Top