మోసాలను ఎండగడుతున్నందుకే దుష్ఫ్రచారం

విజయనగరంః చంద్రబాబుది ప్రజలను మోసం చేసే అధర్మ పోరాటంగా వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అభివర్ణించారు. కాలయాపనే కోసమే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు.  నాలుగేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఏంచేశారని ప్రశ్నించారు. హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీని స్వాగతించలేదా.. సమాధానం చెప్పాలన్నారు. మోదీకి, వెంకయ్యకు సన్మానాలు చేసింది చంద్రబాబు కాదా ప్రశ్నించారు.. ఇన్నాళ్లూ మోసం చేసి ఇప్పుడు 25 మంది ఎంపీలను అడగడానికి అర్హత లేదన్నారు. ప్రత్యేకహోదా వైయస్‌ జగన్‌వల్లే సాధ్యమన్నారు.  చంద్రబాబు మోసాలను పాదయాత్రలో ఎండగడుతున్నందుకే చంద్రబాబు వైయస్‌ జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.విజయనగరం జిల్లా చ్రరితలో ఏ నేతకు రాని  స్పందన వైయస్‌ జగన్‌కు వస్తోందన్నారు.
Back to Top