ప్రతిపక్షంపై ఎదురుదాడి

అమరావతి: ప్రత్యేక హోదాపై చర్చకు డిమాండ్‌ చేసిన ప్రతిపక్షంపై ప్రభుత్వం మరోసారి ఎదురుదాడినే మార్గంగా ఎంచుకుంది. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో మరోసారి తీర్మానం చేయాలంటూ వైయస్‌ఆర్‌ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించారు. అయితే చర్చకు అనుమతించాల్సిందేనంటూ వైయస్సార్సీపీ సభ్యులు పట్టుబట్టారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేసిన వైయస్‌ఆర్ సీపీ సభ్యులకు ప్రత్యేక వ్యాధి ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అవహేళన చేసేలా మాట్లాడారు. 

ముగిసిపోయిన అంశంపై ఇంకా చర్చ ఏంటి..అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తీసి పారేశారు. రాష్ట్రంలో ఒక్క సమస్య కూడా లేదు కనుక, ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు హోదాను ఎగతాళి చేశారు. ఐదుకోట్ల ఆంధ్రుల సంజీవని అయిన ప్రత్యేకహోదా అంశాన్ని ప్రభుత్వం నీరుగార్చడం అత్యంత హేయనీయం. 
Back to Top