సునీత విమర్శ అసమంజసం: వైయస్ఆర్ సీపీ

అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు మతిభ్రమించిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ విమర్శించారు.  ప్రజల సమస్యలను తెలుసుకోడానికి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రకు వైయస్ షర్మిల శ్రీకారం చుడుతుంటే అన్న కోసం యాత్ర చేస్తోందని పరిటాల సునీత అనడం సరికాదన్నారు. తక్షణం ఆ మాటను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉష, నగర కన్వీనర్ శ్రీదేవి మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు చేసిన మేలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏనాడూ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని చంద్రబాబు అధికార దాహంతో నేడు పాదయాత్ర చేపట్టాడని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో జననేత జగన్‌మోహన్ రెడ్డి ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేశారన్నారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్‌తో కుమ్మక్కై అరెస్టు చేయించారని ఆరోపించారు. ప్రజా సంక్షేమం కోసం భారతదేశంలోనే తొలి మహిళగా వైయస్ షర్మిల పాదయాత్ర చేస్తుంటే సాటి మహిళగా మెచ్చుకోవాల్సింది పోయి దిగజారి మాట్లాడడం సమంజసం కాదన్నారు

Back to Top