శుక్రవారం షర్మిల యాత్ర సాగేదిలా...

మహబూబ్‌నగర్: షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం ఉదయం కలుగోట్ల గ్రామం నుంచి బయల్దేరి పోతులపాడు స్టేజీ మీదుగా సాగుతుంది. స్టేజీ సమీపంలో శనగ రైతులతో షర్మిల మాట్లాడతారు.
అనంతరం అక్కడినుంచి బొంకూరు మీదుగా చంద్రశేఖర్‌నగర్‌ చేరుకుంటారు. శ్రీనగర్ మీదుగా కలుకుంట్లకు చేరుకుని అక్కడి ప్రజలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు.
అనంతరం బూడిదపాడు క్రాస్ వరకు యాత్ర కొనసాగించి రాత్రికి అక్కడే బసచేస్తారు.
శుక్రవారం మొత్తం 14.6 కి.మీ యాత్ర సాగనుంది.

Back to Top