బాబు చేసిన పాపం వల్లే అరిష్టం

()బాబు పుష్కరాలను అపవిత్రం చేశారు
()ఘాట్ లకు పచ్చరంగు పులిమి ప్రచారం చేసుకోవడం ఘోరం
()హైందవ మతసంప్రదాయాలను మంటగల్పారు
()భక్తులను నిర్బంధించి 12 రోజుల పాటు పీడించారు
()వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఫైర్

హైదరాబాద్ః  కృష్ణా పుష్కరాలను అపవిత్రం చేసి బాబు పాపం చేశారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. కృష్ణా పుష్కరాలను కూడా పార్టీ ప్రచారానికి వాడుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. పుష్కర ఘాట్ లకు పచ్చరంగు పులిమి చంద్రబాబు హైందవ మత సంప్రదాయాలను మంటగల్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రస్నానం కోసం వచ్చిన భక్తులను నిర్బంధించి చంద్రబాబు తన ఉపన్యాసాలతో 12 రోజుల పాటు పట్టి పీడించారని ఫైర్ అయ్యారు.  హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ ఏమన్నారంటే....

చంద్రబాబు చేసిన పాపం అనుభవిస్తాడు..
()కృష్ణా పుష్కరాలను నేనే తీసుకొచ్చానని బాబు ప్రచార ఆర్భాటం చేసుకోవడం సిగ్గుచేటు. కృష్ణా పరివాహప్రాంతమంతా పుష్కరాలు జరుగుతుంటే విజయవాడలోనే పుష్కరాలు జరుగుతున్నట్లు కలరింగ్ ఇచ్చారు. 
()పుష్కరాలకు కేటాయించిన రూ. 1800 కోట్లలో ...తెలుగుదేశం కాంట్రాక్టర్లు, కార్యకర్తలకు నామినేషన్ల పద్దతిన కట్టబెట్టి సగానికి పైగా నిధులను స్వాహా చేశారు. 
()పవిత్ర కృష్ణానదీ తీరంలోని ఘాట్ లన్నంటికీ పచ్చరంగు పులిమి ప్రచారం చేసుకునే నీచ స్థితికి చంద్రబాబు సర్కార్ దిగజారింది 
()పుష్కరాలకు ముందు విజయవాడలోని అనేక దేవాలయాలను విచ్చలవిడిగా కూల్చేశారు.  విగ్రహాలను గోనెసంచుల్లో కుట్టి మున్సిపాలిటీ వ్యాన్ ల్లో పడేశారు. 
()పవిత్రమైన కృష్ణానదీ గర్భాన్ని చీల్చి చంద్రబాబు, లోకేష్ లు ఇసుక మాఫియాకు పాల్పడ్డారు.   కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు
నదిలో ఇసుక గుంతలు తవ్వి ఐదుగురు విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నారు. 
()పుష్కరాలు బ్రహ్మాండంగా జరిగాయని బాబు చెబుతుంటే, పత్రికల్లో రాస్తుంటే ప్రజలు చెవిలో పువ్వులు పెట్టుకొని వినాల్సిన పరిస్థితి వచ్చింది
()కృష్ణా పుష్కరాలను బాబు అపవిత్రం చేశారు. హైందవ సంప్రదాయం ప్రకారం పంచెకట్టుతో ఉత్తరీయం మెడలో వేసుకొని మూడుసార్లు మునిగి స్నానమాచరిస్తారు. కానీ, బాబు ష్టర్ ,  ప్యాంట్ తో  సగం మునిగి పవిత్రతను మంటగల్పారు. అదే వేరేవారు షర్టు, ప్యాంట్ వేసుకొని స్నానం చేస్తే బాబు, మీడియా ఉతికిపారేసేవి. 
()పుష్కరాలకు వచ్చిన ప్రజానీకాన్ని 12 రోజులపాటు నిర్బంధించి తన ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను పట్టి పీడించారు.ఆధ్యాత్మిక గురువులతో ఉపన్యాసాలు ఇవ్వడం మానేసి...రాజకీయాలు మాట్లాడుతూ  బాబు పార్టీ ప్రచారం చేసుకోవాలని చూశారు. ఇది సరైంది కాదని బాబు గ్రహించడం లేదు. 
()జీడీపీ రేటును 12 శాతం పెంచేందుకు సమర్థులు కావాలని పవిత్రస్నానం కోసం వచ్చిన వారితో ప్రమాణం చేయించడం దారుణం.  
() అన్యాయాలు, అక్రమాలకు పాల్పడను. రాష్ట్రాన్ని ఇకమీదట దోచుకోను అని నదీతల్లి మీద బాబు ప్రమాణం చేస్తే బాగుండేది. బాబు ప్రచారం చేసుకోవడం.... భజన ఛానల్స్ వాటిని పనిగట్టుకొని చూపించడం హేయనీయం. 
()పుష్కరాల్లో అది వేరేవారు షర్టు, ప్యాంట్ వేసుకొని స్నానం చేస్తే బాబు, మీడియా ఉతికిపారేసేవి. బాబు  ప్రమాదకర ధోరణికి తీసుకెళ్లేలా చేశారు
దైవం, పురాణాలు, నదులు, సంప్రదాయాల మీగ విశ్వాసం ఉంటే మంచి పనులు చేయాలి
()3 నిమిషాల కన్నా ఎక్కువ సేపు స్నానం చేస్తే రోగాలు వస్తాయని ఈనాడులో వచ్చింది. నీరును ప్రవహింపజేసేవిదంగా ఉంటే బాగుండేది
కలుషిత నీటిలో స్నానాలు చేసిన పరిస్థితిని కల్పించారు. 
()ఓ పక్క కృష్ణానదిలోనీళ్లు లేక  డెల్టా మలమల మాడిపోతుంటే...పక్కనే ఉండి బాబు ఉపన్యాసాలిస్తున్నారు తప్ప రైతులు ఏవిధంగా బాధపడుతున్నారో పట్టించుకోవడం లేదు
()చంద్రబాబు చిత్తశుద్ధి లేని కార్యక్రమాలు చేయబట్టే రాష్ట్రానికి అరిష్టం పట్టింది. న్యాయంగా, డబ్బు తినకుండా చేసినట్లయితే భగవంతుడు ఆశీర్వదించేవారు. బాబు చేసిన పాపానికి ప్రజలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
()పుష్కరాల పేరిట కోట్లాది రూపాయలు కాజేసి తాబేదారులకు పంచిపెట్టారు. వందల ప్లెక్సీలు పెట్టి ప్రచార ఆర్భాటాలతో ముఖ్యమంత్రి పాపం చేశారు. అనుభవించక తప్పదు. 
()వర్షాలు లేవు. కరువు తాండవించింది. నదిలో నీళ్లు లేవు. ఉన్నవి కలుషితమైపోయినవి
()నాగార్జున సాగర్ కుడికాలువలో పంటలు వేసుకోమన్నారు. డెల్టా కింద  పంటలు ఎండిపోతున్నాయి. బాబు చేసిన పాపాల వల్లే వరుణుడు కరుణించడం లేదు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top