రాష్ట్రబంద్ విజయవంతం

న‌డ‌వ‌ని బ‌స్సులు, మూత‌ప‌డ్డ వ్యాపార సంస్థ‌లు
ప్రత్యేకహోదా కోసం నినదించిన ప్రజానీకం
 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా త‌ప్ప‌ని స‌రి అని ప్ర‌త్యేక హోదాతోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి సాధ్య‌మ‌ని, అటువంటి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యం చేస్తున్న నేప‌థ్యంలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చిన రాష్ట్ర‌బంద్‌లో ప్ర‌జ‌లు, వ్యాపార వ‌ర్గాలు స్వ‌చ్ఛంధంగా పాల్గొంటున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా బంద్ విజ‌య‌వంతంగా కొన‌సాగుంది. వైయస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపుకు ప్రజలు, వాణిజ్య, వ్యాపార సంస్థల యజమానులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడంతో అన్ని పట్టణాల్లో దుకాణాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హోదా కోసం నినదించిన వైయస్సార్సీపీ నేతలను పోలీసులు పలుచోట్ల అరెస్ట్ చేసి స్టేషన్ లకు తరలించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై వైయస్సార్సీపీ మండిపడింది. 
Back to Top