చిత్తూరు జిల్లాలో జగన్‌ నేటి పర్యటన ఇలా

చిత్తూరు, 1 డిసెంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత, జననేత శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర రెండవ రోజు ఆదివారం చిత్తూరు జిల్లాలో ప్రారంభమైంది. ఆదివారం ఉదయం శెట్టిపల్లి మెడికల్ కాలేజీ సెంట‌ర్ నుంచి ‌ఆయన పర్యటన మొదలైంది.

శెటిపల్లె, పోడూరు, కడపల్లె, కనుమలదొడ్డి, తమిశల మీదుగా శ్రీ జగన్ శాంతిపురం చేరుకుని అక్కడ‌ మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తరువాత మఠం, గుండశెట్టిపల్లె, నాయనపల్లె, రాజుపేట, మిట్టపల్లె మీదుగా రామకుప్పం చేరుకుంటారు. అక్కడ వైయస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఎం.సముద్రం, బియ్యపురెడ్డిపల్లె కాలనీ, అన్నవరం, కరకుంట, గంధమాకులపల్లె మీదుగా సాయంత్రం 4 గంటలకు వి.కోట చేరుకుని‌ అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. అనంతరం దొడ్డిపల్లె, మార్నేపల్లె, మద్దికాల, కృష్ణాపురం, కొమ్మర మడుగులో శ్రీ జగన్మోహన్‌రెడ్డి రోడ్ షో నిర్వహిస్తారు.

సమైక్యాంధ్ర కోసం‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి రోజు శనివారం కుప్పంలో జరిగిన భారీ బహిరంగం సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో శ్రీ వైయస్ జగ‌న్కు అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు పలికారు.

Back to Top