పొట్టి శ్రీరాములుకు విజయమ్మ, జగన్ నివా‌ళి

హైదరాబాద్ :

తెలుగు మాట్లాడే వారందరికీ ఒకే రాష్ట్రం కావాలని ఆత్మార్పణం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం ఉదయం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, అధ్యక్షుడు‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి తమ క్యాంపు కార్యాలయంలో నివాళులు అర్పించారు. అమరజీవి చిత్రపటానికి వారు పూలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, భూమా శోభా‌ నాగిరెడ్డి, గొల్ల బాబూరావు, టి. బాలరాజు, ధర్మాన కృష్ణదాస్, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, చెన్నకేశవరెడ్డి, బి.గురునాథరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పినిపె విశ్వరూప్, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు సి.నారాయణరెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు, మేకా శేషుబాబు, జూపూడి ప్రభాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్ , పేర్ని వెంకట్రామయ్య, జోగి రమేష్, మద్దాలి రాజేష్‌కుమార్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పార్టీ నాయకులు కొణతాల రామకృష్ణ, ఎంవీ మైసూరారెడ్డి, చిత్తూరు జిల్లా నాయకుడు పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమరజీవి ఆత్మబలిదానాన్ని స్మరించుకున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top